ఇదేం విచిత్రం.. ఆమె కడుపే ఓ బీరు ఫ్యాక్టరీ.. ఆశ్యర్చపోతున్న వైద్యులు..!

వైద్య శాస్త్రంలో ఎంతో అధునాతన టెక్నాలజీ రావడంతో ఎలాంటి ఆరోగ్య సమస్య తలెత్తిన వైద్యులు క్షణాల్లో పట్టేస్తున్నారు. అలాంటిది ఒక్కోసారి కొన్ని కొన్ని విచిత్రమైన పరిస్థితుల్లో ఆ వైద్యులు కూడా తలలు పట్టుకోవాల్సి వస్తుంది. ఓ మహిళకు తలెత్తిన వింత సమస్యను చూసి డాక్టర్లు అవాక్కయ్యారు. ఆమె ఎప్పుడు టాయిలెట్‌కు వెళ్తున్నా లిక్కర్ వాసన వస్తోందట. దీంతో ఆందోళనకు గురైన సదరు మహిళ.. వైద్యులను సంప్రదించింది. తాను యూరిన్‌కు వెళ్తుంటే.. మద్యం వాసన వస్తోందని.. అలా అని […]

ఇదేం విచిత్రం.. ఆమె కడుపే ఓ బీరు ఫ్యాక్టరీ.. ఆశ్యర్చపోతున్న వైద్యులు..!
Follow us

| Edited By:

Updated on: Feb 27, 2020 | 5:35 AM

వైద్య శాస్త్రంలో ఎంతో అధునాతన టెక్నాలజీ రావడంతో ఎలాంటి ఆరోగ్య సమస్య తలెత్తిన వైద్యులు క్షణాల్లో పట్టేస్తున్నారు. అలాంటిది ఒక్కోసారి కొన్ని కొన్ని విచిత్రమైన పరిస్థితుల్లో ఆ వైద్యులు కూడా తలలు పట్టుకోవాల్సి వస్తుంది. ఓ మహిళకు తలెత్తిన వింత సమస్యను చూసి డాక్టర్లు అవాక్కయ్యారు. ఆమె ఎప్పుడు టాయిలెట్‌కు వెళ్తున్నా లిక్కర్ వాసన వస్తోందట. దీంతో ఆందోళనకు గురైన సదరు మహిళ.. వైద్యులను సంప్రదించింది. తాను యూరిన్‌కు వెళ్తుంటే.. మద్యం వాసన వస్తోందని.. అలా అని తనకు మద్యం తాగే అలవాటు కూడా లేదని వైద్యుల దగ్గర వాపోయింది.

వివరాల్లోకి వెళితే.. పెన్సిల్వినియాలోని ఓ విశ్వ విద్యాలయంలోని ఆఫ్ పిట్స్‌బర్గ్ మెడికల్ సెంటర్ ప్రెస్బేటెరియన్ ఆస్పత్రి తెలిపిన వివరాల ప్రకారం.. ఓ 61 ఏళ్ల మహిళ.. ఇటీవల వింత సమస్యతో ఇబ్బంది పడుతోందని.. నిత్యం యూరిన్ వెళ్లినప్పుడు.. మద్యం వాసన వస్తోందని తెలిపారు. అయితే ఆ మహిళకు మద్యం తాగే అలవాటు కూడా లేదని.. దీంతో ఆమెకు వైద్య పరీక్షలు నిర్వహించినట్లు తెలిపారు. అయితే టెస్టుల తర్వాత వచ్చిన రిపోర్టులను పరిశీలించిన వైద్యులు.. ఆమె మూత్రం మద్యంలో ఎందుకు మారిందో తెలుసుకున్నారు.

అయితే బాధిత మహిళ.. మధుమేహ వ్యాధితో బాధపడుతోందని గుర్తించారు. అయితే గతంలో వైద్యులు ఆమెకు కాలేయ మార్పిడి చేయాలని సూచించారని.. ప్రస్తుతం ఆమె కాలేయాన్ని దానం చేసే దాతలు కోసం ఎదురుచూస్తోందని గుర్తించారు. తొలుత అధికంగా లిక్కర్ తాగడంతోనే కాలేయం పాడై ఉంటుందని భావించిన వైద్యులు.. ఆ తర్వాత ఆమె మద్యం బానిస కాదని పరీక్షల్లో గుర్తించారు. అంతేకాదు.. ఆమె రక్తంలో ఎక్కడా కూడా మద్యం నమూనాలే లేవని రిపోర్టులు వచ్చాయి. దీంతో మళ్లీ క్షుణ్ణంగా పరిశీలించిన వైద్యులు.. మద్యం ఎలా వస్తుందో గుర్తించారు.

కాండిడా గ్లాబ్రాటా అనే హాప్లోయిడ్ ఈస్ట్ జాతికి చెందిన ఓ సూక్ష్మజీవి ఆమె కడుపులో అధిక స్థాయిలో ఉన్నట్లు వైద్య నిపుణులు కనుగొన్నారు. ఈ సూక్ష్మజీవి ప్రతి ఒక్కరిలోనూ ఉత్పత్తి అవుతుందని.. అయితే ఆమెలో షుగర్ లెవల్స్ ఎక్కువగా ఉండటంతో.. అవి పేగుల్లో తిష్టవేశాయని తెలిపారు. అయితే బీరు తయారీలో ఉపయోగించే ఓ ఫంగస్‌‌లా ఈ సూక్ష్మజీవులు పనిచేస్తాయన్నారు. బీరు తయారీకి వాడే గింజల్లోని కార్బోహైడ్రేట్లను ఆల్కహాల్‌గా తయారుచేసేందుకు ఈ ఫంగస్‌ను ఉపయోగిస్తారని.. అయితే ఇలాంటి ప్రక్రియే ఆమె కడుపులో కూడా జరుగుతుందని.. దీని ప్రభావంతో మూత్రానికి బదులు మద్యం తయారవుతోందని పేర్కొన్నారు. ఈ ప్రకియ అంతా బాధిత మహిళ ఆమె కడుపులోనే జరుగుతోందన్నారు. ఈ విచిత్రమైన సమస్యను “యురినరీ ఆటోబ్రేవరీ సిండ్రోమ్” అంటారని పేర్కొన్నారు. ఇలాంటి సమస్య ఎవరికైనా ఎదురైతే నిర్లక్ష్యం చేయకుండా.. వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచిస్తున్నారు.