తల్లీకూతుళ్ల సాహసం..గొలుసు దొంగకు బడిత పూజ

A woman in Delhi's Nangloi thrashed a chain-snatcher as he attempted to escape. The incident has been captured on CCTV and the video has gone viral, తల్లీకూతుళ్ల సాహసం..గొలుసు దొంగకు బడిత పూజ

ఢిల్లీలో ఓ తల్లీకూతుళ్ల సాహసం అందరి చేత ప్రశంసలు అందుకుంటుంది. గొలుసు కొట్టేద్దామని బైక్​పై వచ్చిన దొంగలను ధైర్యంగా ఎదుర్కొన్నారు. తల్లీ కూతుర్లు రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తుండగా.. బైక్​పై వచ్చిన ఇద్దరు దొంగల్లో ఒకడు మహిళ మెడలోని గొలుసును లాక్కున్నాడు. అప్రమత్తంగా ఉన్న ఆమె వెంటనే అతడి షర్ట్ పట్టుకోని బలంగా లాగింది. దీంతో బైక్ పడిపోవడంతో పారిపోడానికి వీలు చిక్కలేదు. ఇంతలో ఇరుగుపొరుగువారు వచ్చి దొంగకి దేహశుద్ది చేశారు. ఇంకొకడు పారిపోయాడు.  అనంతరం పోలీసులు ఇద్దరు గొలుసు దొంగలను అరెస్టు చేశారు. ఆ వీధిలో ఉన్న సీసీ కెమెరాల్లో ఈ ఘటనంతా రికార్డయ్యింది. ఢిల్లీలోని నంగోలోయ్​లో శనివారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *