మొసలీ! నాకు నీవొక లెక్కా? నా తలనే ఇచ్చా!

ఫ్లోరిడాలోని లోని బ్రైటన్‌లో జరిగిన ఫ్రీస్టైల్ ఎలిగేటర్ రెజ్లింగ్ పోటీలో అష్లే లారెన్స్‌ అనే మహిళ మైదానంలో అడుగుపెట్టింది. చుట్టూ కొంత దూరంలో జనాలు గుమిగూడి ఉన్నారు. ఆమె ఎదురుగా ఓ మొసలి ఉంది. ఆమె దానికి

మొసలీ! నాకు నీవొక లెక్కా? నా తలనే ఇచ్చా!
Follow us

| Edited By:

Updated on: Mar 08, 2020 | 6:22 PM

ఫ్లోరిడాలోని లోని బ్రైటన్‌లో జరిగిన ఫ్రీస్టైల్ ఎలిగేటర్ రెజ్లింగ్ పోటీలో అష్లే లారెన్స్‌ అనే మహిళ మైదానంలో అడుగుపెట్టింది. చుట్టూ కొంత దూరంలో జనాలు గుమిగూడి ఉన్నారు. ఆమె ఎదురుగా ఓ మొసలి ఉంది. ఆమె దానికి చేరువగా వెళ్లింది. గోరుముద్దలు తినిపించడానికి అన్నట్లుగా మొసలి నోరును తెరిచేందుకు ప్రయత్నించింది. అయితే ఆ మొసలి అందుకు సహకరించలేదు.

ఎలిగేటర్ రెజ్లింగ్ పోటీలో అష్లే లారెన్స్‌ అతి కష్టంగానే రెండు చేతులతో దాన్ని అదిమిపట్టుకుని నోరును తెరిచింది. వెంటనే నేరుగా ఆమె తలను మొసలి నోట్లోకి పోనిచ్చింది. ఇది చూసిన వారికి క్షణంపాటు గుండె కొట్టుకోవడం ఆపేసినట్లనిపిస్తుంది. అసలే కౄర జంతువు. పైగా దాని నోట్లో తలకాయ పెట్టడం అంటే మృత్యువుకు ఎదురెళ్ళడమే. కానీ అదృష్టవశాత్తూ కొన్ని సెకన్ల తర్వాత ఎలాంటి ప్రమాదం బారిన పడకుండానే దాని నోట్లో నుంచి సురక్షితంగా తల బయటకు తీసింది.