Breaking News
  • విజయనగరం: కొత్తవలస మండలం అప్పనపాలెంలో రోడ్డుప్రమాదం. ఆటోను ఢీకొన్న కారు, నలుగురికి తీవ్రగాయాలు, ఆస్పత్రికి తరలింపు.
  • అమరావతి: రేపు టీడీఎల్పీ సమావేశం. మంగళగిరి టీడీపీ కార్యాయలంలో ఉ.10:30కి సమావేశం. అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చ. మధ్యాహ్నం నుంచి ముఖ్యనేతలతో చంద్రబాబు సమావేశం.
  • ఢిల్లీ: నిర్భయ కేసు. న్యాయవాది ఏపీ సింగ్‌కు బార్‌ కౌన్సిల్‌ నోటీసులు. రెండు వారాల్లోగా సమాధానం చెప్పాలని ఆదేశం. న్యాయవాది ఏపీ సింగ్‌పై విచారణకు ఆదేశించిన ఢిల్లీ హైకోర్టు. నిర్భయ దోషుల తరఫున వాదిస్తున్న ఏపీ సింగ్.
  • నల్గొండ: మున్సిపల్‌ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు ఓట్లు అడిగే హక్కులేదు-ఉత్తమ్‌. 40 లక్షల మంది ఎస్సీలకు కేబినెట్‌లో మంత్రి పదవి లేదు. మున్సిపల్‌ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌, కేసీఆర్‌కు షాక్‌ తప్పదు-ఉత్తమ్‌కుమార్‌.
  • ఓయూ అసిస్టెంట్‌ ప్రొ.కాశిం ఇంటిపై పోలీసుల దాడిని ఖండించిన సీపీఐ. కాశిం ఇంటిపై పోలీసుల దాడి అప్రజాస్వామికం-చాడ వెంకట్‌రెడ్డి. రాష్ట్రంలో పాలన ఎమర్జెన్సీని తలపిస్తోంది. కాశిం ఇంట్లో సోదాలను వెంటనే నిలిపివేయాలి-చాడ వెంకట్‌రెడ్డి.

దొంగతనానికి వచ్చి బిడ్డనే మర్చిపోయింది !

Women Steals Stoller From shop and forgot baby, దొంగతనానికి వచ్చి బిడ్డనే మర్చిపోయింది !

ఎవరు తీసుకున్న గోతిలో వారే పడతారు.. అన్న సామెత ఇక్కడ వీళ్లకు అక్షరాల సరిపోతుంది. న్యూజెర్సీలో చోటు చేసుకున్న ఓ సంఘటన అందుకు ఉదాహరణగా నిలుస్తోంది. న్యూజెర్సీలోని ఓ స్టోర్‌కి వెళ్లిన ముగ్గురు కిలాడీ లైడీస్‌ దొంగతనం చేసి అడ్డంగా దొరికిపోయారు. బిడ్డ కోసం స్టోలర్‌ తెచ్చేందుకు ఓ మహిళ తన బిడ్డతో పాటు మరో ఇద్దరు స్నేహితులతో కలిసి షాపుకు వెళ్లింది. ఈ క్రమంలోనే తన ఫ్రెండ్స్‌ ఇద్దరు స్టోర్‌ యజమానితో మాటలు కలుపగా బిడ్డను పక్కన కూర్చోబెట్టిన సదరు మహిళ స్టోలర్‌ను తీసుకుని మెల్లగా జారుకుంది. కాసేపటి తర్వాత ఆమె స్నేహితులు కూడా స్టోర్‌ నుంచి బయటపడ్డారు. అయితే, తీరా బయటికి వెళ్లాక చూసుకుంటే..తమ వెంట తీసుకువచ్చిన బుడ్డొడ్డు కనిపించలేదు.. దీంతో పాపా కోసం మళ్లీ ముగ్గురూ కలిసి స్టోర్‌లోకి వచ్చారు. అయితే, ఇక్కడే అసలు బండారం బయటపడింది. అప్పటికే సీసీ కెమెరా ఆధారంగా జరిగిన దొంగతనాన్నికనిపెట్టారు స్టోర్‌ సిబ్బంది.
పాపా కోసం వచ్చిన ముగ్గురిని పట్టుకున్న షాపు యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ముగ్గురు కిలాడీ లేడీస్‌ ని అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు.

మొత్తానికి దొంగతనం చేయబోయి పట్టుబడిని సంఘటన దృశ్యాలను సదరు షాపు యజమాని తన ఫేస్‌బుక్ లో అప్‌లోడ్‌ చేశాడు. ఆ ముగ్గురు మహిళలను ఉద్దేశించి తన కామెంట్‌ కూడా పెట్టాడు. దొంగతనం చేయడం వారి వ్యక్తిగత విషయం. అయితే స్టోర్‌లోకి తీసుకువచ్చిన పిల్లలను కూడా అలా వదిలేసి వెళ్లడం దారుణం. ఇలాంటి వాళ్లకు బుద్ది రావాలనే ఈ వీడియో షేర్‌ చేస్తున్నా’ అంటూ పోస్ట్‌ చేశాడు. ఈ వీడియో చూసిన నెటిజన్లు సైతం బిడ్డను మర్చిపోయి వెళ్లిన తల్లిపై సోషల్‌ మీడియా వేదికగా విమర్శలు గుప్పిస్తున్నారు.