భర్తను రూ. 5 లక్షలకు బేరం పెట్టిన భార్య

అచ్చం ఓ సినిమాలో జరిగినట్లే నిజ జీవితంలో జరిగింది. అమని, జగపతి బాబు, రోజా నటించిన శుభలగ్నంలో చిత్రంలోని సీన్ రిఫిట్ అయ్యింది. తాళి కట్టిన భ‌ర్త‌ను మ‌రో మ‌హిళ‌కు అమ్మేసింది.

  • Balaraju Goud
  • Publish Date - 3:30 pm, Wed, 21 October 20

అచ్చం ఓ సినిమాలో జరిగినట్లే నిజ జీవితంలో జరిగింది. అమని, జగపతి బాబు, రోజా నటించిన శుభలగ్నంలో చిత్రంలోని సీన్ రిఫిట్ అయ్యింది. తాళి కట్టిన భ‌ర్త‌ను మ‌రో మ‌హిళ‌కు అమ్మేసింది. ఈ మూవీలో డ‌బ్బు పిచ్చిప‌ట్టిన ఆమ‌ని త‌న భ‌ర్త‌ను రోజాకు కోటి రూపాయాల‌కు అమ్మేసింది. అచ్చం ఆ సినిమాలో ఆమ‌ని చేసిన‌ట్లే ఈ మ‌హిళ త‌న భ‌ర్త‌ను బేరానికి పెట్టింది. ఈ సంఘ‌ట‌న క‌ర్ణాట‌క‌లోని మాండ్య జిల్లాలోని ఓ గ్రామంలో ఏడాది క్రితం చోటుచేసుకుంది. ఈ వార్త అప్ప‌ట్లో సంచ‌ల‌నం సృష్టించింది. ఇప్పుడు మ‌రోసారి సోష‌ల్ మీడియాలో గ‌త రెండు, మూడు రోజుల నుంచి విస్తృతంగా వైర‌ల్ అవుతోంది.

మాండ్య జిల్లాలోని ఓ గ్రామానికి చెందిన ఇద్ద‌రు భార్యాభ‌ర్త‌ల సంసారం సాఫీగా సాగుతోంది. ఈ క్ర‌మంలోనే భ‌ర్త జ‌ల్సాల‌కు అల‌వాటు ప‌డి ఓ మ‌హిళ వ‌ద్ద రూ. 5 ల‌క్ష‌లు అప్పు చేశాడు. అప్పు చెల్లించ‌మ‌ని స‌ద‌రు మ‌హిళ‌.. అత‌నిపై ఒత్తిడి చేసింది. త‌న‌ వద్ద డ‌బ్బులు లేక‌పోవ‌డంతో అప్పు తీర్చ‌లేక‌.. ఆమెకు సుఖాన్ని ఇస్తున్నాడు. దీంతో ఆమె డ‌బ్బులు అడ‌గ‌డం మానేసింది. మొత్తానికి ఈ విష‌యం సొంత భార్య‌కు తెలియ‌డంతో.. భ‌ర్త త‌న ప్రియురాలితో స‌న్నిహితంగా ఉన్న స‌మ‌యంలో రెడ్ హ్యాండెడ్‌గా ప‌ట్టుకుంది.

జ‌ల్సాలకు అలవాటుపడి కాపురాన్ని రోడ్డుపాలు చేసిన భ‌ర్త త‌న‌కొద్దు అని గ్రామ‌పెద్ద‌ల ముందు పంచాయితీ పెట్టింది. ప్రియురాలేమో త‌న రూ. 5 ల‌క్ష‌లు చెల్లించి భ‌ర్త‌ను తీసుకెళ్లమని భార్య‌కు తెగేసి చెప్పింది. త‌న వ‌ద్ద డ‌బ్బులు లేవ‌ని, భ‌ర్త నుంచి రూ. 5 ల‌క్ష‌ల భ‌ర‌ణం కావాల‌ని, లేదంటే కోర్టుకు వెళ్తాన‌ని పెద్ద‌ల‌కు చెప్పింది. కావాలంటే త‌న భ‌ర్త‌ను నువ్వే కొనుక్కో అని ఆమె బంపర్ ఆఫర్ ఇచ్చింది. దీంతో ప్రియురాలు ఆమెకు మరో రూ. 5 ల‌క్ష‌లు చెల్లించి భ‌ర్త‌ను కొంటాన‌ని చెప్పింది. దీంతో రూ. 5 లక్షలు చెల్లించి ప్రియుడిని సొంతం చేసుకుంది.