Breaking News
  • స్పీకర్‌ తీరు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసే విధంగా ఉంది. సభలో స్పీకర్‌ తీసుకునే నిర్ణయాలు సీఎం తీసుకుంటున్నారు. స్పీకర్‌ సస్పెండ్‌ చేయకుండానే మార్షల్స్‌ బయటకు ఎలా తీసుకెళ్తారు. -మీడియా పాయింట్‌లో చినరాజప్ప. సీఎం కూడా రౌడీలా వ్యవహరిస్తున్నారు-చినరాజప్ప. సీఎం ఆదేశాలతోనే మార్షల్స్‌ నన్ను బయటకు తీసుకొచ్చారు. సస్పెండ్‌ చేయకుండా నన్ను బయటకు తీసుకురావడం.. సభా నిబంధనలకు విరుద్ధం-మీడియా పాయింట్‌లో చినరాజప్ప.
  • ప్రకాశం: ఒంగోలులో అపస్మారకస్థితిలో పడిఉన్న మహిళ. ఘటనా స్థలంలో మహిళ లోదుస్తులు, కండోమ్స్‌ గుర్తింపు. మహిళపై అత్యాచారం జరిగినట్టు అనుమానం. పోలీసుల సహకారంతో మహిళను ఆస్పత్రికి తరలింపు. మహిళ నోట్లో బియ్యం కుక్కి హత్యచేసేందుకు దుండగుల యత్నం. మహిళ ఊపిరితిత్తుల్లో బియ్యం గింజలు గుర్తించిన వైద్యులు. మహిళ పరిస్థితి విషమం.
  • శాసన మండలిలో వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లులపై చర్చ. 3 గంటలపాటు చర్చకు అనుమతించిన డిప్యూటీ చైర్మన్‌. పార్టీల వారీగా సమయం కేటాయించిన డిప్యూటీ చైర్మన్‌. టీడీపీకి 84 నిమిషాలు, వైసీపీకి 27 నిమిషాలు.. పీడీఎఫ్‌ 15 నిమిషాలు, బీజేపీకి 6 నిమిషాల సమయం కేటాయింపు.
  • శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌ నుంచి ఢిల్లీకి బయల్దేరిన పవన్‌కల్యాణ్‌. పవన్‌కల్యాణ్‌ వెంట నాదెండ్ల మనోహర్‌. రేపు మధ్యాహ్నం వరకు ఢిల్లీలో ఉండనున్న పవన్‌కల్యాణ్‌. పలువురు బీజేపీ పెద్దలను కలవనున్న పవన్‌కల్యాణ్.
  • తెలంగాణ భవన్‌ నుంచి ఎన్నికల సరళీని సమీక్షిస్తున్న మంత్రి తలసాని. నగర మేయర్‌ బొంతు రామ్మోహన్‌, జిల్లాల కోఆర్డినేటర్లు.

ఇదేదో బాగుంది.. తిండి తింటూ లక్షల్లో సంపాదిస్తోంది.. మీరు ట్రై చేస్తారా..?

Woman Quits Job To Eat McDonald's and Chinese Takeout, ఇదేదో బాగుంది.. తిండి తింటూ లక్షల్లో సంపాదిస్తోంది.. మీరు ట్రై చేస్తారా..?

ప్రతి మనిషి ఉద్యోగం చేసేది డబ్బులు సంపాదించుటకే. అయితే కొందరు మాత్రం ఉద్యోగం కాకుండా వ్యాపారం చేస్తూ కూడా డబ్బులు సంపాదిస్తుంటారు. ఇక ప్రస్తుత ఆధునిక యుగంలో అయితే.. సోషల్ మీడియాను ఉపయోగించి కూడా డబ్బులు సంపాదించవచ్చు. ముఖ్యంగా యూట్యూబ్‌ ద్వారా అనేక మంది లక్షల్లో డబ్బులు సంపాదిస్తున్నారు. యూట్యూబ్‌లో వీక్షకులను ఆకట్టుకునే వీడియోలను పోస్ట్ చేస్తూ.. వాటి ద్వారా పెద్ద మొత్తంలో డబ్బులు సంపాదిస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా అనేక మంది కేవలం యూట్యూబ్‌ సంపాదనపైనే బతికేస్తున్నారు. యూట్యూబ్‌లో వీడియోలు పెట్టడం తొలుత హాబీగా ప్రారంభించి.. ఆ తర్వాత దానిని వృత్తిగా మార్చుకున్న వారు అనేకం ఉన్నారు. వీడియోలు పోస్ట్ చేయడం ద్వారా పెద్ద మొత్తంలో డబ్బులు రావడంతో తమ ఉద్యోగాలను సైతం వదులుకుని పూర్తి సమయాన్ని దీని కోసమే కేటాయిస్తూ వస్తున్నారు కొంతమంది.

లండన్‌కు చెందిన చర్నా రైలీ అనే యువతి కూడా యూట్యూబ్ ద్వారా లక్షల్లో ఆదాయం వస్తోంది. దీంతో తన ఉద్యోగాన్నీ కూడా వదిలేసుకుంది. అయితే అంతా సాధారణంగా ఫన్నీ వీడియోస్ లేదా షార్ట్ ఫిల్మ్స్ వంటి కంటెంట్ పెట్టి డబ్బులు సంపాదిస్తుంటారు. కానీ ఈ యువతి ఎంచుకున్న కంటెంట్ చూస్తే షాక్ తింటారు. యూట్యూబ్‌లో అందర్నీ ఆకట్టుకునేందుకు తనకు ఇష్టమైన ఫుడ్‌నే కంటెంట్‌గా మార్చుకుంది ఈ యువతి.

Woman Quits Job To Eat McDonald's and Chinese Takeout, ఇదేదో బాగుంది.. తిండి తింటూ లక్షల్లో సంపాదిస్తోంది.. మీరు ట్రై చేస్తారా..?ఇష్టమైన ఫుడ్ తింటూ.. ఆ వీడియోలను తన యూట్యూబ్ ఛానల్‌లో అప్‌లోడ్ చేస్తుంది. ఇదే ఆమె పని. ఇదంతా వినడానికి వింతగా ఉన్నా.. ఆమె తింటున్న వీడియోలను నిత్యం 40 వేలమంది చూస్తున్నారట. తన వీడియోలకు ఈ స్థాయిలో స్పందన వస్తుండటంతో.. చర్నా చేస్తున్న ఉద్యోగానికి గుడ్‌బై చెప్పి యూట్యూబ్ వీడియోలకే ఫుల్ టైంను కేటాయించేస్తోంది. హాయిగా రుచికరమైన ఫుడ్ (పిజ్జా, బర్గర్లు) తింటూ.. ఆ వీడియోలను యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేస్తూ ఆదాయాన్ని పొందుతుంది. ప్రస్తుతం ఈమె తినే తిండికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతున్నాయి.

Woman Quits Job To Eat McDonald's and Chinese Takeout, ఇదేదో బాగుంది.. తిండి తింటూ లక్షల్లో సంపాదిస్తోంది.. మీరు ట్రై చేస్తారా..?