Breaking News
  • సికింద్రాబాద్‌-మచిలీపట్నం మధ్య ప్రత్యేక రైళ్లు. డిసెంబర్‌ 1,8,15,22,29 తేదీల్లో నడవనున్న ప్రత్యేక రైళ్లు. మచిలీపట్నంలో మధ్యాహ్నం 2:25కి బయల్దేరి.. రాత్రి 10:10కి సికింద్రాబాద్‌కు చేరుకోనున్న ప్రత్యేక రైలు. అదేరోజు సికింద్రాబాద్‌ నుంచి రాత్రి 11:55కి బయల్దేరి.. మరుసటి రోజు ఉ.8:55కి మచిలీపట్నం చేరుకోనున్న ప్రత్యేక రైలు.
  • ఏపీకి నెంబర్లు కేటాయించిన కేంద్రం. అక్రమ మైనింగ్‌, అనధికార మద్యం అమ్మకాలపై.. ఫిర్యాదులకు నెంబర్లు కేటాయించిన కేంద్ర సర్కార్‌. అక్రమ మైనింగ్‌పై ఫిర్యాదు కోసం 14400 నెంబర్‌.. అనధికార మద్యంపై ఫిర్యాదుకు 14500 నెంబర్‌ కేటాయింపు.
  • మళ్లీ పెరిగిన బంగారం ధరలు. పెళ్లిళ్ల సీజన్‌ కొనుగోళ్లతో పెరిగిన పసిడి ధరలు. 10గ్రాముల 24క్యారెట్ల బంగారంపై రూ.225 పెంపు. రూ.38,715 పలుకుతున్న 10గ్రాముల బంగారం. రూ.440 పెరిగి రూ.45,480కి చేరిన కిలో వెండి ధర.
  • ఛండీగడ్‌: 2019 ప్రపంచ కబడ్డీ కప్‌కు పంజాబ్ ఆతిథ్యం. డిసెంబర్‌ 1 నుంచి 9 వరకు మ్యాచ్‌ల నిర్వహణ. సుల్తాన్‌పూర్‌ లోధిలోని గురునానక్‌ స్టేడియంలో ప్రారంభ వేడుక. ప్రపంచ కబడ్డీ టోర్నీలో పాల్గొననున్న భారత్, అమెరికా, శ్రీలంక.. ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, కెన్యా, న్యూజిలాండ్‌, పాకిస్తాన్‌, కెనడా జట్లు.
  • ఓటర్ల జాబితా సవరణకు కొత్త షెడ్యూల్‌ విడుదల. జనవరి 1, 2020 అర్హత తేదీతో ఓటర్ల జాబితా సవరణ. ఓటర్ల వివరాల పరిశీలనకు ఈనెల 30 తుది గడువు. డిసెంబర్‌ 16న ఓటర్ల జాబితా ముసాయిదా ప్రచురణ. 2020, జనవరి 15న అభ్యంతరాలు, వినతుల స్వీకరణ.
  • టిక్‌టాక్‌కు పోటీగా త్వరలో ఇన్‌స్టాగ్రామ్‌ కొత్త ఫీచర్‌. రీల్స్‌ పేరిట ఓ కొత్త ఫీచర్‌ అందుబాటులోకి. ఇన్‌స్టాగ్రామ్‌లోని ఎక్స్‌ప్లోర్‌ సెక్షన్‌లో కొత్త ఫీచర్. కొత్త ఫీచర్‌లో టిక్‌టాక్ మాదిరిగా వీడియోలు క్రియేట్‌ చేసే సౌకర్యం.

ఫైన్‌ను తప్పించుకునేందుకు.. ఈ యువతి ఏం చేసిందంటే..!

విమానంలో ప్రయాణించాలంటే కచ్చితంగా రూల్స్ ఉంటాయి. ముఖ్యంగా లగేజ్ విషయంలో కొన్ని నియమాలు ఉంటాయి. లగేజ్ ఎక్కువ ఉంటే విమాన సిబ్బంది వారు అస్సలు ఒప్పుకోరు. ఇక ఈ ఇబ్బందిని అధిగమించేందుకు కొంతమంది ప్రయాణికులు అప్పుడప్పుడు తమ బుర్రకు పనిపెడుతూ ఉంటారు. తాజాగా లగేజ్ విషయంలో ఫైన్ తప్పించుకోవడం కోసం ఈ యువతి చేసిన పని.. ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది.

when the airline staff at the check in counter said: “EXCESS NA PO KAYO, 7kg lang po allowed na hand carry.”me: NO PROBLEM! 😏*from 9kg to 6.5kg baggage 😅#ExcessBaggageChallengeAccepted

Gel Rodriguez यांनी वर पोस्ट केले मंगळवार, १ ऑक्टोबर, २०१९

ఫిలిప్పెన్స్ నుంచి ఇటీవల రోద్రిగ్రెజ్ అనే యువతి వేరే ప్రదేశానికి వెళ్లేందుకు ఓ ఎయిర్‌పోర్టుకు వెళ్లింది. అక్కడ చెక్ కౌంటర్‌లో ఆమె బ్యాగ్‌ను పరిశీలించిన సిబ్బంది.. మోతాదుకు మించి లగేజ్ ఉందని.. ఫైన్ కట్టాలని అన్నారు. అయితే ఫైన్ కట్టేందుకు సరిపడ డబ్బులు ఆమె వద్ద లేవు. మరోవైపు ఆ బ్యాగ్‌లోని లగేజ్‌ను వదులుకునేందుకు రోద్రిగ్రెజ్ సిద్ధంగా లేదు. ఈ నేపథ్యంలో 2.5కేజీల బరువు గల దుస్తులను తన ఒంటిపై ధరించి.. బ్యాగ్ బరువును తగ్గించింది. దీనికి సంబంధించిన ఫొటోను రోద్రిగ్రెజ్‌నే తన సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఎయిర్‌పోర్ట్ సిబ్బంది 7కేజీలకు మించి లగేజ్‌ను తీసుకెళ్లకూడదన్నారు. వెంటనే నా 9కేజీల బరువును 6.5కేజీలకు ఇలా తగ్గించేశాను అంటూ కామెంట్ పెట్టింది. ఇక ఈ పోస్ట్ కాస్త వైరల్‌గా మారగా.. నెటిజన్లు ఆమె తెలివికి మెచ్చుకుంటున్నారు. లగేజ్ బరువును తగ్గించావు.. నీ ఐడియా సూపర్.. నువ్వు సూపర్.. నేను కూడా ఇలానే చేశాను అంటూ కామెంట్లు పెట్టారు.