విజయవాడలో దారుణం.. అర్ధాంగిని కిరాతకంగా.

Woman Murdered Brutally By Her Husband In Vijayawada

విజయవాడలో దారుణం చోటుచేసుకుంది. పట్టపగలే మణిక్రాంతి ఓ వివాహితను నరికి హత్యచేసిన ఘటన సత్యనారాయణ పురం శ్రీనగర్ కాలనీలో భయాందోళనకు గురిచేసింది. భార్యాభర్తల మధ్య వివాదాలే హత్యకు కారణం అని మృతురాలి బంధువులు చెబుతున్నారు. మృతురాలి ఇంటి ముందే భర్త మాటువేసి భర్త.. షాపింగ్ ముగించుకుని ఇంటికి వచ్చిన భార్యను రాగానే జుట్టు పట్టుకుని రోడ్డుపై లాక్కెళ్లి కత్తితో తలను నరికి సమీపంలో ఉన్న కాలువలో తలను పడేసి పోలీసులకి లొంగిపోయాడు. మృతురాలి తరపు కుటుంబసభ్యులు నిందితుడిని తమకు అప్పగించాలంటూ డిమాండ్‌ చేశారు. ఘటనా స్థలంలో మృతదేహాన్ని తీసుకెళ్లకుండా అడ్డుకునేందుకు యత్నించారు. అనంతరం రంగంలోకి దిగిన పోలీసులు మణిక్రాంతి మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని  పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *