టాయిలెట్ లో ఏడాదిగా మహిళ నిర్బంధం

హర్యానాలోని రిషిపూర్ గ్రామంలో అమానుషం...తన భార్యను ఆమె భర్తే ఏడాదిగా టాయిలెట్ లో బంధించేశాడు. చాలా రోజులపాటు తిండీ తిప్పలు లేకుండా ఆమె అక్కడే గడిపింది. ఎవరో ఇఛ్చిన సమాచారంతో మహిళా రక్షణ..

టాయిలెట్ లో ఏడాదిగా మహిళ నిర్బంధం
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: Oct 15, 2020 | 12:09 PM

హర్యానాలోని రిషిపూర్ గ్రామంలో అమానుషం…తన భార్యను ఆమె భర్తే ఏడాదిగా టాయిలెట్ లో బంధించేశాడు. చాలా రోజులపాటు తిండీ తిప్పలు లేకుండా ఆమె అక్కడే గడిపింది. ఎవరో ఇఛ్చిన సమాచారంతో మహిళా రక్షణ విభాగం ఆ నిస్సహాయురాలిని రక్షించింది. తాము ఈ ఇంటికి వఛ్చి చూసేసరికి ఆ మహిళ టాయిలెట్ లోనే మగ్గుతున్న హృదయ విదారక దృశ్యం కనిపించిందని ఆ విభాగం అధికారి రజనీ గుప్తా తెలిపారు. సంవత్సర కాలంగా ఆమె అందులోనే ‘లాక్ అయి ‘ ఉందని, ఈ విషయాన్ని ధృవీకరించుకున్నామని గుప్తా చెప్పారు. షాక్ తిన్నతాము  ఆమెను వెంటనే ఆసుపత్రికి తరలించామన్నారు. ఆహరం లేక నీరసించి బక్క చిక్కి ఉన్న ఆమెకు డాక్టర్లు చికిత్స అందిస్తున్నారు. అయితే తన భార్య మానసిక దౌర్బల్యంతో బాధ పడుతున్నందున తాను అలా టాయిలెట్ లో లాక్ చేశానని ఆమె భర్త  నరేష్ చెబుతున్నాడు.  బయట కూర్చోమని చెప్పినా ఆమె వినేది కాదన్నాడు. కానీ మహిళా విభాగం వారు మాత్రం ఆమెకు మానసిక దౌర్బల్యం ఏమీ లేదని తెలిపారు. డాక్టర్ల పర్యవేక్షణలో ఉన్న ఆమె త్వరలో కోలుకుంటుందన్న ఆశాభావాన్ని వారు వ్యక్తం చేశారు.