విజయనగరం జిల్లాలో భారీ పేలుడు కలకలం

విజయనగరం జిల్లాలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. బొబ్బిలి పట్టణం దేవాంగుల వీధిలో గెంబలి శ్రీనివాసరావు అనే వ్యాపారి ఇంట్లో అక్రమంగా నిల్వ ఉంచిన మందుగుండు సామగ్రి పేలి మూడు ఇళ్లు దగ్దం అయ్యాయి. తెల్లవారుజామున చోటుచేసుకున్న అగ్నిప్రమాదం బొబ్బిలిలో కలకలం రేపింది. దీపావళి సందర్బంగా నిల్వవుంచిన మందు గుండు సామాగ్రి పేలటంతో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. ప్రమాదంలో ఓ మహిళకు గాయాలయ్యాయి. బాధితురాలిని వెంటనే స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందజేస్తున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక […]

విజయనగరం జిల్లాలో భారీ పేలుడు కలకలం
Follow us

| Edited By: Ravi Kiran

Updated on: Sep 19, 2019 | 1:39 PM

విజయనగరం జిల్లాలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. బొబ్బిలి పట్టణం దేవాంగుల వీధిలో గెంబలి శ్రీనివాసరావు అనే వ్యాపారి ఇంట్లో అక్రమంగా నిల్వ ఉంచిన మందుగుండు సామగ్రి పేలి మూడు ఇళ్లు దగ్దం అయ్యాయి. తెల్లవారుజామున చోటుచేసుకున్న అగ్నిప్రమాదం బొబ్బిలిలో కలకలం రేపింది. దీపావళి సందర్బంగా నిల్వవుంచిన మందు గుండు సామాగ్రి పేలటంతో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. ప్రమాదంలో ఓ మహిళకు గాయాలయ్యాయి. బాధితురాలిని వెంటనే స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందజేస్తున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపుచేశారు. ఒక్కసారిగా పెద్ద శబ్దంతో మందుగుండు సామాగ్రి పేలడంతో ఆ శబ్దాలకు స్థానికులు భయబ్రాంతులకు గురయ్యారు. జరిగిన ఘటన పై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.