నదిని దాటి “నర్సమ్మ” వైద్యసేవలు..ఆమెవే మానవతా విలువలు

ఆ గ్రామాన్ని చేరుకోవాలంటే నది దాటాల్సిందే. గ్రామ ప్రజలకు ఎలాంటి అత్యవసర పరిస్థితి వచ్చినా సరే నది అవతలి ఒడ్డుకు వెళితే తప్ప సహాయం లభించని పరిస్థితి. ముఖ్యంగా అనారోగ్య సమస్యలు, విషజ్వరాలు, చావుబతుకుల సమస్యలు, గర్భిణీ స్త్రీల ప్రసవాల సమయాల్లో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఆ గ్రామ ప్రజలు. అయితే ఆగ్రామంపై ఉన్న అభిమానం, ప్రజలకు సేవ చేయాలనే బలీయమైన ఆశతో ఓ ఆరోగ్య కార్యకర్త ఎంతో ధైర్యంచేసి నదిని దాటివెళ్లి వైద్య సేవల్ని అందిస్తోంది. […]

నదిని దాటి నర్సమ్మ వైద్యసేవలు..ఆమెవే మానవతా విలువలు
Follow us

| Edited By:

Updated on: Sep 17, 2019 | 3:53 PM

ఆ గ్రామాన్ని చేరుకోవాలంటే నది దాటాల్సిందే. గ్రామ ప్రజలకు ఎలాంటి అత్యవసర పరిస్థితి వచ్చినా సరే నది అవతలి ఒడ్డుకు వెళితే తప్ప సహాయం లభించని పరిస్థితి. ముఖ్యంగా అనారోగ్య సమస్యలు, విషజ్వరాలు, చావుబతుకుల సమస్యలు, గర్భిణీ స్త్రీల ప్రసవాల సమయాల్లో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఆ గ్రామ ప్రజలు. అయితే ఆగ్రామంపై ఉన్న అభిమానం, ప్రజలకు సేవ చేయాలనే బలీయమైన ఆశతో ఓ ఆరోగ్య కార్యకర్త ఎంతో ధైర్యంచేసి నదిని దాటివెళ్లి వైద్య సేవల్ని అందిస్తోంది.

ఛత్తీస్‌ఘడ్‌ బలరామ్‌పూర్ జిల్లాలో ఉన్న ఓ నదిని దాటివెళ్లి ప్రతిరోజు అక్కడున్న గ్రామస్తులకు వైద్య సేవల్ని అందిస్తోంది పుష్పలత అనే ఆరోగ్య కార్యకర్త. విధి నిర్వహణలో భాగంగా గ్రామంలో అందరికీ వైద్య సేవలు అందిస్తోంది. దీనికోసం ఎంతకష్టమైనా సరే ప్రతిరోజు నది దాటుతూ గ్రామానికి చేరుకుంటుంది. ఈ విధంగా నదిని దాటే సమయంలో ఎంతో భయం వేస్తుందని చెబుతూ.. బ్రిడ్జి ఉండి ఉంటే ఇన్ని కష్టాలు ఉండేవి కావు అని చెప్పింది పుష్పలత.

ఆమెతో పాటు వైద్యాన్ని అందిస్తున్న గ్రామీణ వైద్యాధికారి షంషేర్ అలీ మాట్లాడుతూ నదికి దగ్గరలో ఎక్కడా ఎటువంటి ఆరోగ్య కేంద్రాలు లేవని, అందుకోసమే నదిని దాటుతూ ప్రజలకు వైద్యసేవలు చేయాల్సివస్తుందన్నారు. ఒక్కోసారి నదిలో నీటిప్రవాహం పెరిగినా తమ సేవల్ని వాయిదా వేసుకోలేదని ఆయన చెప్పారు. బ్రిడ్జి లేకపోవడంతో గ్రామస్తులు ఎక్కడికీ వెళ్లలేకపోతున్నారంటూ అలీ ఆవేదన వ్యక్తం చేశారు.

గ్రామంలో దాదాపు 1,500 మంది ప్రజలు నివసిస్తున్నారు. వీరంతా వైద్యం కోసం పక్క ఊరికి వెళ్లాలంటే ఈ నదిని దాటాల్సిందే. కానీగర్భిణి స్త్రీల డెలివరీ సమయంలో అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోందని వీరు చెబుతున్నారు. ఇక ఇదే విషయంపై గ్రామస్తులు మాట్లాడుతూ తమ గ్రామానికి బ్రిడ్జి సౌకర్యాన్ని కల్పించాలని ఛత్తీస్‌ఘడ్ ప్రభుత్వాన్ని కోరుతున్నారు.