కవలల మధ్య 10 ఏళ్ల గ్యాప్

సాధారణంగా కవలలు అంటే కొన్ని నిమిషాల గ్యాప్‌లోనూ.. లేదా కొద్ది రోజులు గ్యాప్ తీసుకొని పుట్టడం జరుగుతుంటుంది. అయితే చైనాలో ఓ మహిళకు 10 ఏళ్ల గ్యాప్‌తో కవలలు పుట్టారు.

కవలల మధ్య 10 ఏళ్ల గ్యాప్
Follow us

| Edited By:

Updated on: Jun 20, 2020 | 10:04 PM

సాధారణంగా కవలలు అంటే కొన్ని నిమిషాల గ్యాప్‌లోనూ.. లేదా కొద్ది రోజులు గ్యాప్ తీసుకొని పుట్టడం జరుగుతుంటుంది. అయితే చైనాలో ఓ మహిళకు 10 ఏళ్ల గ్యాప్‌తో కవలలు పుట్టారు. ఈ సంఘటన హ్యూబేలో జరగ్గా.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

వివరాల్లోకి వెళ్తే.. హ్యూబేకు చెందిన వాంగ్ అనే ఓ మహిళ 2009లో ఐవీఎఫ్ పద్దతి ద్వారా గర్భం దాల్చింది. ఈ క్రమంలో 2010 జూన్‌లో ఆమెకు లూలూ అనే బిడ్డ పుట్టాడు. ఇక భవిష్యత్ అవసరాల నిమిత్తం ఆమె శరీరంలోని అండాలను వైద్యులు అలానే ఉంచారు. ఇక గతేడాది మళ్లీ తల్లి కావాలనుకున్న వాంగ్.. అప్పట్లో ఐవీఎఫ్ చేసిన వైద్యుడిని సంప్రదించింది. ఇలా రెండోసారి కూడా వాంగ్ గర్భవతి అయ్యింది. ఇక ఈ నెల 16న ఆమెకు మరో మగ బిడ్డ జన్మించాడు. అతడికి టాంగ్‌టాంగ్‌ అనే పేరును పెట్టారు. లూలు లాగానే టాంగ్‌టాంగ్‌ కూడా ఉండగా.. పదేళ్ల తరువాత అంతే బరువుతో లూలూ పుట్టిన అదే నెలలో టాంగ్‌ టాంగ్‌ పుట్టడం విశేషం. దీంతో ఈ కవలల మధ్య పదేళ్ల గ్యాప్ ఏర్పడింది.

Read This Story Also:  రానా-మిహీకాల పెళ్లి ఎక్కడంటే..!