పెళ్లి కుమారుడికి బహుమతిగా ఏకే 47.. సోషల్ మీడియాలో వీడియో వైరల్..

బంధువుల పెళ్లికో, స్నేహితుల పెళ్లికో వెళ్తే మనం ఏం గిఫ్ట్ ఇస్తాం..? వారి వారి స్థోమతను పట్టి ఏ ఫ్రిజ్జో.. కూలరో.. టీవీయో ఇస్తాం. మరీ అయితే బంగారు నగలో, మరేదో ఇస్తాం..

  • Shiva Prajapati
  • Publish Date - 9:00 pm, Sat, 28 November 20
పెళ్లి కుమారుడికి బహుమతిగా ఏకే 47.. సోషల్ మీడియాలో వీడియో వైరల్..

బంధువుల పెళ్లికో, స్నేహితుల పెళ్లికో వెళ్తే మనం ఏం గిఫ్ట్ ఇస్తాం..? వారి వారి స్థోమతను పట్టి ఏ ఫ్రిజ్జో.. కూలరో.. టీవీయో ఇస్తాం. మరీ అయితే బంగారు నగలో, మరేదో ఇస్తాం. కానీ ఇక్కడ ఓ మహిళ పెళ్లి కొడుక్కి ఏం గిఫ్ట్ ఇచ్చిందో తెలిస్తే షాక్ అవుతారు. ఓ పెళ్లికి హాజరైన మహిళ పెళ్లి కొడుక్కి ఏకంగా ఏకే 47 తుపాకీని బహుమతిగా ప్రదానం చేసింది. దీంతో అక్కడి వారంతా అవాక్కయ్యారట. ఆ బహుమతిని ప్రదానం చేసిన మహిళ పెళ్లి కొడుక్కి అత్తయ్య అవుతారట. అయితే ఈ ఘటన మనదేశంలో కాదులేండి. మన దాయాది దేశమైన పాకిస్తాన్‌లో చోటు చేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. ఈ వీడియోను చూసిన పలువురు నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. పాకిస్తాన్ టెర్రరిజానికి కేంద్ర బిందువు అని చెప్పడానికి ఈ ఘటనే నిదర్శనం అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఏది ఏమైనా పెళ్లిలో ఏకే 47 తుపాకీని బహుమతిగా ఇవ్వడం అనేది షాకింగ్ విషయమనే చెప్పాలి.