Breaking News
  • తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం. శ్రీవారి ఉచిత దర్శనానికి 10 గంటల సమయం. ఈరోజు శ్రీవారి హుండీ ఆదాయం రూ.2.92 కోట్లు. సాయంత్రం వరకు శ్రీవారిని దర్శించుకున్న 45,143 మంది భక్తులు.
  • హైదరాబాద్‌: గచ్చిబౌలిలో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి సన్నీబాబు ఆత్మహత్య. ఆత్మహత్య చేసుకుంటున్నట్టు బావ సంపత్‌కు సన్నీబాబు ఈ మెయిల్‌. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు.
  • ఏలూరు ప్రభుత్వాస్పత్రిలో గానాబజానా వ్యవహారంపై ప్రభుత్వం ఆగ్రహం. ఆరుగురు సిబ్బందిపై శాఖాపరమైన విచారణ చేపట్టిన వైద్యారోగ్యశాఖ. హెడ్‌ నర్సులు, నర్సింగ్‌ సూపరింటెండెంట్‌లు, ఫార్మాసిస్ట్‌లపై.. చర్యలు తీసుకుంటూ ఆదేశాలు జారీ.
  • వరంగల్‌: మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర హుండీల లెక్కింపు. 436 హుండీల లెక్కింపు పూర్తి. రూ.10.29 కోట్ల ఆదాయం.
  • రామాయపట్నం పోర్టు పరిధిని నిర్ధారిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు. పోర్టు జియో కోఆర్డినేట్స్‌ను నోటిఫై చేసిన మౌలిక వనరులకల్పన శాఖ. పోర్టు నిర్మించిన ప్రాంతానికి 30 కి.మీ. పరిధిలో.. మరో ఓడరేవు నిర్మించేందుకు వీల్లేకుండా అంగీకారం. రామాయపట్నం పోర్టు నిర్మాణంపై.. డీపీఆర్‌ రూపకల్పనలో భాగంగా పోర్టు పరిధి నిర్ధారిస్తూ ఉత్తర్వులు. ప్రభుత్వానికి వివిధ ప్రతిపాదనలు పంపిన ఏపీ మారిటైమ్‌ బోర్డు. నాన్‌ మేజర్‌ పోర్టుగా రామాయపట్నంను అభివృద్ధి చేయనున్న ప్రభుత్వం.
  • హైదరాబాద్‌: సీసీఎస్‌ పోలీసులకు కరాటే కల్యాణి ఫిర్యాదు. సోషల్ మీడియాలో శ్రీరెడ్డి తనను అసభ్యపదజాలంతో దూషించిందని ఫిర్యాదు. శ్రీరెడ్డిపై 506, 509 ఐటీ యాక్ట్ కింద కేసు నమోదు. సోషల్‌ మీడియాలో అసభ్య కామెంట్స్ చేయడం చట్టరీత్యా నేరం. సపోర్టింగ్‌ కామెంట్స్ చేసినవారిపై కూడా చర్యలు తీసుకుంటాం -సీసీఎస్‌ సైబర్‌క్రైమ్‌ ఏసీపీ ప్రసాద్.

సంచలనం: మహిళను రేప్ చేసేందుకు.. భర్తను దొంగతనం కేసులో ఇరికించి..

gang rape in uttar pradesh, సంచలనం: మహిళను రేప్ చేసేందుకు.. భర్తను దొంగతనం కేసులో ఇరికించి..

సినిమాల్లో కూడా ఇలాంటి కన్నింగ్ ప్లాన్‌ను చూసి ఉండకపోవచ్చు..! అందంగా ఉందని.. ఆమెను ఎలాగైనా పొందాలన్న కాంక్షతో కొందరు దుర్మార్గులు వేసిన పక్కా స్కెచ్ గురించి తెలిస్తే మైండ్ బ్లాక్ అయిపోతుంది. ఈ దారుణ ఉదంతం ఉత్తరప్రదేశ్‌లో జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. యూపీలోని బరేలీ జిల్లాలో సిరౌలీ అనే చిన్న గ్రామంలోని జంటపై నలుగురు యువకుల కన్ను పడింది. భర్త లేనప్పుడు అతని భార్యను ఎలాగైనా రేప్ చేయాలని అనుకున్నారు. ఈ క్రమంలోనే పక్కా ప్లాన్‌తో అతన్ని ఓ దోపిడీ కేసులో ఇరికించి జైలుకు పంపించారు. ఇంకేముంది తాము అనుకున్నట్లే ఆ మృగాళ్లు గత శుక్రవారం రాత్రి ఆమెపై కోరిక తీర్చుకునేందుకు ఒంటరిగా ఉన్న సమయంలో ఇంట్లోకి దూరారు. ఆమె నోట్లో గుడ్డలు కుక్కి.. విడతల వారీగా ఆ నలుగురు యువకులు ఆమెను గ్యాంగ్ రేప్ చేశారు.

అంతటితో ఆగని ఈ కామాంధులు తమ గుట్టు ఎక్కడ రట్టు అవుతుందేమోనని భయపడి కత్తితో ఆమె గొంతు కోశారు. కానీ ప్రాణాలతో బయటపడిన ఆమె గ్రామంలోని చుట్టుపక్కల వారిని పిలవడంతో ఆ నలుగురూ తప్పించుకుని పారిపోయారు. స్థానికులు పోలీసులకు సమాచారం అందివ్వడంతో వారు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. నిందితులు అదే గ్రామానికి చెందిన యువైస్, నాజుక్ బేగ్, రియాసత్ బేగ్, అఫ్జల్‌లు అని గుర్తించారు. తనపై అత్యాచారం చేయడానికి తన భర్తను నిందితుల్లో ఒకరైన అఫ్జల్ పక్కా స్కెచ్ వేసి దొంగతనం కేసులో ఇరికించినట్లు బాధితురాలు ఫిర్యాదు చేసింది. కాగా, ఇప్పుడు ఈ కేసు పెద్ద సంచలనంగా మారింది.

Related Tags