రూ. 30 వేలు అడిగినందుకు.. భార్యకు తలాక్ చెప్పేశాడు

Uttar Pradesh Woman Given Triple Talaq For Asking Rs 30 From Husband, రూ. 30 వేలు అడిగినందుకు.. భార్యకు తలాక్ చెప్పేశాడు

చట్టాలు మారుతున్నా మహిళల ఆవేదనకు అంతులేకుండా పోతోంది. మందులు కొనుక్కునేందుకు రూ. 30వేలు ఇవ్వమని భర్తను అడిగినందుకు.. డబ్బులు ఇవ్వకుండా మూడు సార్లు తలాక్ చెప్పి ఆమెను ఇంటి నుంచి గెంటేశాడు. ఉత్తరప్రదేశ్‌లోని హాపుర్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. మూడేళ్ల క్రితమే తనకు వివాహం జరిగిందని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. మందులు కోసం డబ్బులడిగినందుకు తనను ఇంటి నుంచి గెంటేశారని.. పిల్లల నుంచి తనను వేరు చేశారని ఆవేదన వ్యక్తం చేసింది. ఈ ఘటనపై కేసు నమదు చేసుకున్న.. హపూర్ డీఎస్‌‌పీ రాజేష్ సింగ్ తప్పని సరిగా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ముస్లిం మహిళల వివాహ హక్కుల పరిరక్షణ బిల్లు-2019ను ఇటీవల పార్లమెంటు ఆమోదించింది. ఈనెల 1 నుంచి ఇది అమల్లోకి వచ్చింది. దీని ప్రకారం ట్రిపుల్ తలాక్ చెప్పడం శిక్షార్హమైన నేరం అవుతుంది. ఇందుకు పాల్పడితే మూడేళ్ల జైలు శిక్ష పడుతుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *