చట్టం గుప్పెట్లో ఆ ప్రజాప్రతినిధి : కేటీఆర్

అటవీ అధికారులపై దాడితో సిర్పూర్‌ కాగజ్‌నగర్‌ ఉద్రిక్తంగా మారింది. మహిళా అధికారిపై ప్రజాప్రతినిధి అనుచరుల దాడి.. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఫారెస్ట్ ఆఫీసర్ అనితపై జరిగిన దాడిపై టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. మహిళా అధికారిపై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు ట్విట్టర్‌లో తెలిపారు. విధి నిర్వహణలో ఉన్న మహిళ అధికారిపై దాడికి పాల్పడ్డ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప సోదరుడు, జెడ్పీ వైస్‌ చైర్మన్‌ కోనేరు కృష్ణ వ్యవహార శైలిని ఆయన తీవ్రంగా తప్పుబట్టారు. చట్టానికి ఎవరూ […]

చట్టం గుప్పెట్లో ఆ ప్రజాప్రతినిధి : కేటీఆర్
Follow us

| Edited By:

Updated on: Jul 01, 2019 | 11:22 AM

అటవీ అధికారులపై దాడితో సిర్పూర్‌ కాగజ్‌నగర్‌ ఉద్రిక్తంగా మారింది. మహిళా అధికారిపై ప్రజాప్రతినిధి అనుచరుల దాడి.. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఫారెస్ట్ ఆఫీసర్ అనితపై జరిగిన దాడిపై టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. మహిళా అధికారిపై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు ట్విట్టర్‌లో తెలిపారు. విధి నిర్వహణలో ఉన్న మహిళ అధికారిపై దాడికి పాల్పడ్డ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప సోదరుడు, జెడ్పీ వైస్‌ చైర్మన్‌ కోనేరు కృష్ణ వ్యవహార శైలిని ఆయన తీవ్రంగా తప్పుబట్టారు. చట్టానికి ఎవరూ అతీతులు కారని కేటీఆర్‌ స్పష్టం చేశారు. కోనేరు కృష్ణపై కేసు నమోదయిందని.. పోలీసులు అతన్ని అరెస్ట్‌ చేశారని తెలిపారు. మరోవైపు ఈ ఘటనపై సీఎం కేసీఆర్‌ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటపై సమగ్ర విచారణ జరిపించాలని సీఎం అధికారులను ఆదేశించారు.