జగన్ కాన్వాయ్‌కి అడ్డుపడిన మహిళ..!

YS Jagan Convoy, జగన్ కాన్వాయ్‌కి అడ్డుపడిన మహిళ..!

వైసీపీ అధ్యక్షుడు జగన్ తిరుమల శ్రీవారిని దర్శించుకుని అనంతరం తిరిగి రేణిగుంట విమానాశ్రయానికి బయల్దేరారు. ఆ సమయంలో ఓ మహిళ జగన్ కాన్వాయ్‌కు అడ్డుపడింది. తూర్పుగోదావరి జిల్లా అమలాపురానికి చెందిన ఆమె తన భర్తకు ఉద్యోగం కావాలంటూ కాన్వాయ్‌కు అడ్డుగా వెళ్లటంతో భద్రతా సిబ్బంది అప్రమత్తమై ఆమెను పక్కకు తీసుకెళ్లారు. ఈ పెనుగులాటలో ఆ మహిళ చేతికి గాయమైంది. ఇది గమనించిన జగన్ కాన్వాయ్‌ ఆపి మహిళతో మట్లాడి, ఆమె వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన రేణిగుంట విమానాశ్రయానికి బయలుదేరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *