ఆర్గానిక్ సలాడ్‌లో అనుకోని అతిథి.. “బెక్ బెక్” అంటూ చప్పుడు..!

Family Finds Frog Alive In Packaged Organic Salad, ఆర్గానిక్ సలాడ్‌లో అనుకోని అతిథి.. “బెక్ బెక్” అంటూ చప్పుడు..!

సూపర్ మార్కెట్‌లో కూరగాయాలు, ఆకు కూరలు కొనుగోలు చేయాలంటేనే భయం వేస్తోంది. ఒక దానికి బదులు మరొకటి వస్తోంది. తాజాగా అలాంటిదే మళ్లీ రిపీల్ అయింది. కూరగాయల సలాడ్‌లో కప్ప బయటికొచ్చింది. కాలిఫోర్నియాలోని గ్లెన్డాలే ప్రాంతానికి చెందిన అల్లెన్ తన కుటుంబ సభ్యులతో కలిసి ఆర్గనిక్ సలాడ్‌ను తినబోయారు. గతవారం అల్లెన్ నార్త్‌పోర్ట్ వాషింగ్టన్ రోడ్‌లో సలాడ్ కొనుగోలు చేశాడు. అందులోని ఆకులను తినేందుకు ప్యాకెట్ విప్పేందుకు ప్రయత్నించగా.. కప్పను చూసి ఎగిరి దూకేంత పనిచేశారు. అందులో బతికి ఉన్న కప్పను చూడగానే అల్లెన్‌కు ఒళ్లు జలదరించింది. వెంటనే దాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. దీంతో అది వైరల్‌గా మారింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *