పాల్‌పై చీటింగ్ కేసు నమోదు

Cheating Case Against KA Paul, పాల్‌పై చీటింగ్ కేసు నమోదు

హైదరాబాద్‌: మత ప్రచారకుడు, ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్‌పై హైదరాబాద్‌ పంజాగుట్ట పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదైంది. తనను అమెరికా తీసుకెళ్తానని డబ్బులు తీసుకుని తనను మోసం చేశారంటూ పాల్‌పై ఓ మహిళ పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అమెరికా వెళ్లేందుకు విజిట్ వీసా,  స్పాన్సర్‌షిప్‌ లెటర్ అందిస్తానని రూ.15 లక్షలు డిమాండ్ చేశారని, ఇప్పటికే రూ.2లక్షలు చెక్కు ఇవ్వగా ఆ మొత్తాన్ని బ్యాంకు నుంచి కూడా తీసుకున్నారని తూర్పుగోదావరి జిల్లా రామచంద్రపురానికి చెందిన సత్యవతి అనే మహిళ మంగళవారం పోలీసులను ఆశ్రయించారు. ఈ నెల 8న తన నుంచి రూ.2 లక్షల చెక్కును తీసుకుని డబ్బులు డ్రా చేసిన  తర్వాత  స్పాన్సర్‌షిప్‌ లెటర్‌ ఇవ్వకపోవడంతో తాను పోలీసులను ఆశ్రయించినట్టు ఆమె తెలిపారు. దీంతో పంజాగుట్ట పోలీసులు కేఏ పాల్ ఆయన సన్నిహితులు విజయ్, జ్యోతిలపై చీటింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *