Breaking News
  • కరీంనగర్‌: హుజూరాబాద్‌ ప్రభుత్వ ఆస్పత్రిలో టిక్‌టాక్‌ కలకలం. ఆపరేషన్‌ థియేటర్‌లో టిక్‌టాక్‌ చేసిన వైద్యులు. రోగికి ఆపరేషన్‌ చేస్తూ టిక్‌టాక్‌ చేసిన వైద్యుడు శ్రీకాంత్, బృందం. సోషల్‌మీడియాలో వైరలైన వీడియో. వైద్యుల తీరుపై మండిపడుతున్న స్థానికులు.
  • సికింద్రాబాద్‌లో అఖిల భారత పోలీస్‌ బ్యాండ్‌ పోటీల ముగింపు వేడుకలు. హాజరైన ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు.
  • యాదాద్రి:సర్నేనిగూడెం సర్పంచ్ కుటుంబాన్నిపరామర్శించిన కోమటిరెడ్డి. రూ.50 వేలు ఆర్థిక సాయాన్ని అందజేసిన ఎంపీ కోమటిరెడ్డి. సర్పంచ్‌ కుటుంబానికి నా ప్రగాఢ నానుభూతి తెలియజేస్తున్నా. సర్పంచ్‌ కుటుంబానికి రూ.25 లక్షల ఆర్థిక సాయం ప్రకటించాలి. నావంతుగా సర్పంచ్‌ కుటుంబాన్ని ఆదుకుంటా. ఈ విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్తా-ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి.
  • నిజామాబాద్‌: ఎడపల్లిలో ప్రేమజంట ఆత్మహత్యాయత్నం. పురుగుల మందుతాగి ఆత్మహత్యకు యత్నించిన ప్రేమజంట. పరిస్థితి విషమం, ఆస్పత్రికి తరలింపు.
  • ఢిల్లీ: జస్టిస్ ధర్మాధికారి నేతృత్వంలో ఏపీ, టీఎస్ అధికారుల భేటీ. విద్యుత్‌ ఉద్యోగుల విభజన సమస్యలపై సమావేశమైన అధికారులు. ఉదయం అధికారులు, ఉద్యోగుల అభ్యంతరాలు స్వీకరించిన ధర్మాధికారి. ధర్మాధికారి నివేదిక ప్రకారం 655 మంది ఉద్యోగులు.. తమకు భారమవుతున్నారని చెప్పిన ఏపీ డిస్కంలు. కమిటీ నివేదికతో సమస్యలున్నాయన్న టీఎస్ జెన్‌కో, ట్రాన్స్‌కో సీఎండీ. ఉద్యోగుల సమస్య శాంతియుతంగా పరిష్కారమయ్యేందుకే.. నివేదికను అంగీకరిచామన్న తెలంగాణ సీఎండీ ప్రభాకర్‌రావు. విధుల్లోకి చేర్చుకోనందు వల్ల ఇబ్బందులు పడుతున్నట్టు.. ధర్మాధికారికి తెలిపిన ఏపీకి కేటాయించిన ఉద్యోగులు. సమస్యకుపరిష్కారం నివేదిక నుంచి తెచ్చేలా ప్రయత్నిద్ధాం-ధర్మాధికారి. సమస్యను మొదటికితెచ్చి ఉద్యోగుల విభజనను జఠిలం చేయొద్దు-ధర్మాధికారి.

9వ అంతస్తుపై బిల్డింగ్ పైనుంచి పడి..లేచి సాదాసీదాగా వెళ్లిపోయింది

Video Of Woman Walking Away After Falling From 9th Floor Breaks Internet, 9వ అంతస్తుపై బిల్డింగ్ పైనుంచి పడి..లేచి సాదాసీదాగా వెళ్లిపోయింది

భూమి మీద గడ్డిగింజలు ఉండాలిగానీ, ఆ యముడు దిగివచ్చినా ప్రాణం తియ్యలేడు. మన పెద్దలు చెప్పే మాట. ఇప్పుడు జరిగిన ఓ ఇన్సిడెంట్ ‌గమనిస్తే.. ఆ మాటలు నిజమేనేమో అనిపిస్తోంది. రష్యాలోని ఒక టవర్ బ్లాక్ నుండి మహిళ 9వ అంతస్థు నుంచి కింద పడింది. ఆ తర్వాత ఓ నిమిషం అనంతరం లేచి సాదాసీదాగా నడిచుకుంటూ వెళ్లిపోయింది. ఆమె పడిన ఎత్తు ఇంచుమించు 90 అడుగులు ఉంటుంది. ఈ ఇన్సిడెంట్ వీడియో ఫుటేజ్ ఇప్పుడు నెటిజన్లను ఆశ్చర్యచకితులను చేస్తుంది. 

వివరాల్లోకి వెళ్తే..రష్యాలోని ఇజ్లుచిన్స్క్ పట్టణంలోని ఒక అపార్ట్మెంట్ బ్లాక్  తొమ్మిదవ అంతస్తు కిటికీలోంచి, 27 ఏళ్ల మహిళ కిందపడింది. ఆమె కిందకిపడేలోపు ట్రావెల్ పలుసార్లు గాల్లో గిర్రన తిరిగింది. అయితే మంచు కుప్పలో పడటం వల్ల..సదరు మహిళకు చిన్న గాయం కూడా కాలేదు. అయితే, ది సన్ పత్రిక కథనం ప్రకారం, అక్కడినుంచి లేచి వెళ్లిన మహిళ తరువాత తన పొరుగువారిని సంప్రదించి అంబులెన్స్‌కు కాల్ చేయమని కోరింది. ఆమె ప్రస్తుతం పశ్చిమ సైబీరియాలోని చమురు సంపన్న ఖాంటీ-మాన్సీ ప్రాంతంలోని ఆసుపత్రిలో ఇంటెన్సివ్ కేర్‌లో చికిత్స తీసుకుంటుంది. అదరడం వల్ల బాడీలోని నరాలు కొంచెం మెల్ట్ అయ్యాయని డాక్టర్లు వెల్లడించారు. కానీ అంత ఎత్తు నుంచి పడ్డాక కూడా ఆమెకు ఒక్క ఎముక కూడా విరగకపోవడం వైద్యుల్ని ఆశ్యర్యానికి గురిచేసింది. ఆమె పడిపోయిన రోజు అక్కడి ఉష్ణోగ్రత మైనస్ 14 సి. దాని కారణంగా కురిసిన మంచే ఆమె ప్రాణాలను కాపాడింది. అయితే సదరు మహిళ సూసైడ్ చేసుకోవడానికి ప్రయత్నించిందా..? ప్రమాదవశాత్తు పడిపోయిందా లేక ఎవరైనా తొసివేశారా అన్నది తెలియాల్సి ఉంది. 

Related Tags