ఓ పాజిటీవ్ బదులు బీ పాజిటివ్ బ్లడ్ ఎక్కించడంతో బాలింత మృతి

Woman died, ఓ పాజిటీవ్ బదులు బీ పాజిటివ్ బ్లడ్ ఎక్కించడంతో బాలింత మృతి

అనంతపురం ప్రభుత్వ ఆస్పత్రిలో దారుణం జరిగింది. వైద్యుల నిర్లక్ష్యం.. ఓ బాలింత మృతికి కారణమైంది. బాలింతకు రక్తస్రావం కారణంగా ఓ పాజిటీవ్‌ బ్లడ్ ఎక్కించాలి. కానీ.. బీ పాజిటీవ్ బ్లడ్ ఎక్కించారు డాక్టర్లు.. దీంతో ఆ బాలింత మృతి చెందింది. బాలింత కుటుంబ సభ్యులు ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి ఎదుట ఆందోళన చేస్తున్నారు. ఈ ఘటనపై మంత్రి శంకరనారాయణ స్పందించి.. అనంతపురం కలెక్టర్ సత్యనారాయణను వివరణ కోరారు. దీంతో.. విచారణ జరిపిన కలెక్టర్ నలుగురు వైద్యులను సస్పెండ్ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *