Breaking News
  • ప్రస్తుత పరిస్థితుల్లో ఆర్టీసీని నడపలేం-సీఎం కేసీఆర్‌. ఆర్టీసీకి ఇప్పటికే రూ.5 వేల కోట్ల అప్పులున్నాయి. తక్షణం చెల్లించాల్సిన అప్పులు, బకాయిలు దాదాపు రూ.2 వేల కోట్లు. ప్రస్తుతం ఆర్టీసీని నడపాలంటే నెలకు రూ.640 కోట్లు కావాలి. ఆర్టీసీకి ఆర్థిక భారం మోసే శక్తి లేదు. ఆర్థిక మాంద్యం కారణంగా ప్రభుత్వం కూడా భరించే పరిస్థితి లేదు. ఆర్టీసీకి ఉన్న ఒకే ఒక మార్గం బస్సు చార్జీలు పెంచడం. చార్జీలు ఎక్కువైతే ప్రజలు బస్సులు ఎక్కని పరిస్థితి వస్తుంది. ఇప్పుడు ఆర్టీసీని యధావిధిగా నడపడం సాధ్యం కాదు. హైకోర్టు తీర్పు తర్వాతే తుది నిర్ణయం తీసుకుంటాం-కేసీఆర్‌
  • హైదరాబాద్‌: నేడు రూట్ల ప్రైవేటీకరణపై హైకోర్టులో విచారణ. హైకోర్టు తీర్పుపై ఆర్టీసీ కార్మికుల్లో ఉత్కంఠ
  • చంద్రయాన్‌-2 ప్రయోగం విఫలమైందనడం సమంజసం కాదు. ఇలాంటి ప్రయోగాల్లో చిన్న సమస్యలు తలెత్తే అవకాశం సాధారణం. అంతమాత్రాన చంద్రయాన్‌-2 విఫలమైందనడం సరికాదు -కేంద్రమంత్రి జితేంద్రసింగ్‌
  • ఎస్‌పీజీ సెక్యూరిటీ ఉపసంహరణపై ప్రియాంకాగాంధీ స్పందన. రాజకీయాల్లో భాగంగానే సెక్యూరిటీ తొలగించారు. ఇకపై ఈ తరహా ఘటనలు జరుగుతూనే ఉంటాయి-ప్రియాంక
  • తాజ్‌మహల్‌ పరిసరాల్లో డ్రోన్లు ఎగరేసిన విదేశీ యాత్రికులు. రష్యాకు చెందిన ఐదుగురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
  • దేశంలో ఆర్థిక మాంద్యాన్ని ఎదుర్కొనేందుకు.. పెట్టుబడుల ఉపసంహరణ సరైన పరిష్కారం కాదు-మమతాబెనర్జీ. ప్రభుత్వరంగ సంస్థల్లో వాటాల విక్రయం తాత్కాలిక ఉపశమనమే. ఇలాంటి చర్యలు ఆర్థిక వ్యవస్థ స్థిరత్వానికి దోహదం చేయవు-మమత
  • సియాచిన్‌పై పాకిస్తాన్‌ వివాదాస్పద వ్యాఖ్యలు. సియాచిన్‌ వివాదాస్పద ప్రాంతం. అలాంటి ప్రాంతంలో భారత్‌ పర్యాటకాన్ని ఎలా ప్రారంభిస్తుంది. భారత్‌ నుంచి ఎలాంటి మంచిని ఆశించడంలేదన్న పాక్‌
  • ఈశాన్య రాష్ట్రాల్లో భూ ప్రకంపనలు. గౌహతి, షిల్లాంగ్‌లో కంపించిన భూమి. భయంతో ఇళ్లల్లోంచి బయటకు పరుగులు తీసిన జనం

మంత్రి ఇంటి ముందు.. యువతి ఆత్మహత్యాయత్నం..!!

Woman Attempts to Suicide in Frontof Minister Pinipe Viswarup House, మంత్రి ఇంటి ముందు.. యువతి ఆత్మహత్యాయత్నం..!!

తూర్పుగోదావరి జిల్లా మంత్రి పినిపె విశ్వరూప్ ఇంటి ముందు ఓ యువతి ఆత్మహత్యాయత్నం చేసింది. ఈ వార్త.. తూర్పుగోదావరి జిల్లాలో కలకలంగా మారింది. కుటుంబ కలహాల నేపథ్యంలో తనకు న్యాయం చేయాలంటూ.. ఏపీ మంత్రికి ఎన్నిసార్లు ఇంటికి వెళ్లి మొరపెట్టుకున్నా పట్టించుకోకపోవడంతో.. మనస్తాపం చెందిన యువతి ఆత్మహత్యకు పాల్పడింది.

తూర్పు గోదావరి జిల్లాకు చెందిన ఓ యువతి కొంతకాలంగా కుటుంబ సమస్యలతో సతమతమవుతోంది. దీంతో.. ఆమె సమస్యను.. స్థానిక మంత్రికి విన్నవించుకుందామని శుక్రవారం వెళ్లింది. అయినా.. ఆమె ఎన్నిసార్లు వచ్చినా.. మంత్రి అనుమతి ఇవ్వకపోవండంతో.. మనస్తాపం చెందిన ఆమె మంత్రి ఇంటి ముందు.. పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. దీంతో.. అక్కడున్నవారు ఒక్కసారిగా షాక్ అయ్యారు. వెంటనే ఆ యువతిని ఆస్పత్రికి తరలించి.. చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి నిలకడగా ఉందని డాక్టర్లు తెలిపారు. కాగా.. యువతి ఆత్మహత్యాయత్నం చేసుకున్న సమయంలో మంత్రి ఇంట్లో లేరని సమాచారం.