హైదరాబాద్లో ఎన్ఐఏ సోదాలు… యువతి అరెస్ట్
హైదరాబాద్లో ఎన్ఐఏ, పోలీసు అధికారులు సంయుక్తంగా సోదాలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. శనివారం ఉదయం నుంచి మైలార్దేవ్పల్లి, ఫలకనూమా ప్రాంతంలో 8 ఇళ్లలో సోదాలు చేసిన ఎన్ఐఏ పలువుర్ని అదుపులోకి తీసుకున్నది. ఆదివారం రోజు కూడా భాగ్యనగరంలో సోదాలు కొనసాగాయి. ఈ సోదాల్లో ఓ యువతిని ఎన్ఐఏ అధికారులు అరెస్ట్ చేశారు. ఐసిస్ సానుభూతిపరుడు అబ్దుల్ బాసిత్ భార్యగా అధికారులు గుర్తించారు. కాగా.. ఇప్పటికే అబ్దుల్ బాసిత్ను పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. బాసిత్ ఇచ్చిన […]
హైదరాబాద్లో ఎన్ఐఏ, పోలీసు అధికారులు సంయుక్తంగా సోదాలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. శనివారం ఉదయం నుంచి మైలార్దేవ్పల్లి, ఫలకనూమా ప్రాంతంలో 8 ఇళ్లలో సోదాలు చేసిన ఎన్ఐఏ పలువుర్ని అదుపులోకి తీసుకున్నది. ఆదివారం రోజు కూడా భాగ్యనగరంలో సోదాలు కొనసాగాయి. ఈ సోదాల్లో ఓ యువతిని ఎన్ఐఏ అధికారులు అరెస్ట్ చేశారు. ఐసిస్ సానుభూతిపరుడు అబ్దుల్ బాసిత్ భార్యగా అధికారులు గుర్తించారు. కాగా.. ఇప్పటికే అబ్దుల్ బాసిత్ను పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. బాసిత్ ఇచ్చిన సమాచారం మేరకు పాతబస్తీలోని బాసిత్ రెండో భార్య ఇంట్లోనూ ఎన్ఐఏ అధికారులు శనివారం రోజున సోదాలు నిర్వహించారు.