పోలీసులకే చుక్కలు చూపించింది ఈ అమెరికా బామ్మ..

Woman arrested for refusing to sign 'fine' ticket in Oklahoma, పోలీసులకే  చుక్కలు చూపించింది  ఈ అమెరికా బామ్మ..

పోలీసులనుంచి తప్పించుకునే వాళ్లు మనకు కనిపిస్తూనే ఉంటారు. ఇలాంటి వారిని ఛేజ్ చేసి మరీ పట్టుకుని లోపలేస్తుంటారుఖాకీలు. మరి ఇలాంటి ఘటనే అమెరికాలో కూడా జరిగింది. ఓ వృద్దమహిళను పోలీసులు ఛేజ్ చేసి మరీ పట్టుకోవాల్సి వచ్చింది. ఓక్లహామాలోని కింగ్‌ఫిషర్ టౌన్‌లో ఓ మహిళ పోలీసులనుంచి తప్పించుకునే ప్రయత్నంలో జారుకోవాలని చూసింది. ఎందుకంటే ఆమె అంతకుముందు తన కారుతో ఒక వ్యక్తిని ఢీకొట్టింది. ఇలా ఢీ కొట్టినందుకు ఫైన్ విధించారు పోలీసులు. దీన్ని కట్టేందుకు ఆమె నిరాకరించింది. దీంతో ఆమెను పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నం చేశారు. అయినప్పటికీ ఆమె కారును ఆపకపోవడంతో ఛేజ్ చేయాల్సి వచ్చింది. కారులోనుంచి ఎంతకీ ఆమె కారు దిగకపోవడంతో చివరికి గన్ చూపించి కిందపడేసి రెక్కలు విరిచిమరీ అరెస్ట్ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *