పోలీసుల చుట్టూ సివిల్‌ మ్యాటర్‌..! ఏది నిజం..?

తెలంగాణ పోలీసులంటేనే దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు లభించింది. ఫ్రెండ్లీ పోలిసింగ్‌ వ్యవస్థతో పోలీసు శాఖపై ప్రజల్లో ఆదరణ పెరిగింది.. ఇదిలా ఉంటే మరోవైపు పోలీసు శాఖలో సివిల్‌ సెటిల్‌మెంట్లు జరుగుతున్నాయంటూ  వస్తున్న వార్తలు పెను దుమారం రేపుతున్నాయి. యూసఫ్‌ గూడకు చెందిన దంపతులు అట్లూరి సురేష్‌, ప్రవిజ చేసిన కామెంట్స్‌ ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా పెను ప్రకంపనలను సృష్టిస్తున్నాయి. బంజారాహిల్స్ పోలీసులపై ఓ వివాహిత సంచలన ఆరోపణలు చేశారు. ఆమె చెప్పిన దాని ప్రకారం… ఓ వ్యాపార […]

పోలీసుల చుట్టూ సివిల్‌ మ్యాటర్‌..! ఏది నిజం..?
Follow us

|

Updated on: Dec 17, 2019 | 3:26 PM

తెలంగాణ పోలీసులంటేనే దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు లభించింది. ఫ్రెండ్లీ పోలిసింగ్‌ వ్యవస్థతో పోలీసు శాఖపై ప్రజల్లో ఆదరణ పెరిగింది.. ఇదిలా ఉంటే మరోవైపు పోలీసు శాఖలో సివిల్‌ సెటిల్‌మెంట్లు జరుగుతున్నాయంటూ  వస్తున్న వార్తలు పెను దుమారం రేపుతున్నాయి. యూసఫ్‌ గూడకు చెందిన దంపతులు అట్లూరి సురేష్‌, ప్రవిజ చేసిన కామెంట్స్‌ ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా పెను ప్రకంపనలను సృష్టిస్తున్నాయి. బంజారాహిల్స్ పోలీసులపై ఓ వివాహిత సంచలన ఆరోపణలు చేశారు. ఆమె చెప్పిన దాని ప్రకారం… ఓ వ్యాపార వివాదంలో ఆమె భర్తపై కేసు నమోదైంది. డిసెంబర్ 8న పోలీసులు ఆమెకు కాల్ చేసి, భర్తతోపాటూ ఆమెను కూడా సాయంత్రం 4 గంటలకి స్టేషన్‌కి పిలిపించారు. ఆ తర్వాత సాయంత్రం 7 గంటల సమయంలో… భార్యాభర్తల్ని ఫస్ట్ ఫ్లోర్‌లోని డీఐ రూమ్‌కి తీసుకెళ్లారు. ఆమె హ్యాండ్ బ్యాగ్, దంపతుల దగ్గరున్న ఫైల్స్, సెల్ ఫోన్స్ తీసుకున్నారు. ఆ తర్వాత ఆమె డ్రెస్ చింపేసి, అసభ్యంగా ప్రవర్తించారు. అలా తనను చిత్ర హింసలు పెట్టారని ఆమె ఆవేదన వ్యక్తం చేస్తూ ఆరోపణలు చేశారు. తనపై కూడా అక్రమ కేసులు పెట్టారని అన్నారు. రూ.20 లక్షలు ఇచ్చి సెటిల్మెంట్ చేసుకోవాలనీ, లేదంటే ఎన్‌కౌంటర్ చేస్తామని సీఐ కళింగరావు బెదిరించారన్నది ఆమె ఆరోపణ. ఆ వ్యాపార వివాదం ఇప్పటిది కాదు. ఎప్పుడో 7 నెలల కిందట పోలీసులు ఈ వివాదంలో తలదూర్చారన్నది ఆమె చేస్తున్న ఆరోపణ. అప్పటి నుంచీ తనను, తన భర్తనూ వేధిస్తున్నారని ఆమె వాదన. పోలీసులు తనతో అసభ్యంగా ప్రవర్తిచించిన అంశానికి సంబంధించి తన దగ్గర ఆడియో రికార్డులు ఉన్నాయన్న ఆమె… వాటిని ఆధారాలుగా సమర్పిస్తానని తెలిపారు. ఐతే, ఈ అంశంపై స్పందించారు బంజారాహిల్స్ పోలీసులు. దంపతులిద్దరూ కావాలనే పోలీసుల మీద తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. కేవలం కక్ష్య సాధింపు చర్యగానే వీడియో వైరల్‌ చేయడం జరిగిందని పోలీసులు వివరించారు. ఓ సివిల్ కేసు వివాదంలో వాసుదేవ్ శర్మ అనే వ్యక్తి వద్ద సురేష్ 4లక్షల  70వేల రూపాయలు తీసుకుని.. బాకీ అడిగితే ఇవ్వకుండా సురేష్ తప్పించుకు తిరుగుతున్నాడన్నారు. అంతే కాకుండా డబ్బిచ్చిన వాసుదేవ్ శర్మను బెదిరింపులకు గురిచేసారని పోలీసులను  ఆశ్రయించాడు. దీంతో ఇది సివిల్ కేస్ కాబట్టి కోర్టుకు వెళ్లాలని సూచించారు పోలీసులు. పోలీసులు చెప్పినట్లే కోర్టుకు పోయి నోటీసులను తెచ్చి పోలీసులకు ఇవ్వడంతో కోర్టు ఆదేశాల మేరకు సురేష్ ను పిలిపించి మాట్లాడినట్లు పోలీసులు తెలిపారు. కానీ సురేష్ ఎస్సై కాలర్ పట్టుకొని తమకు పెద్ద పెద్ద వ్యక్తులు తెలుసని దురుసుగా ప్రవర్తించినట్లు పోలీసులు పేర్కొన్నారు. దీంతో ఇద్దరిపైనా పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసారు. వారిపై పోలీసులు ఎఫ్ఐఆర్ బుక్ చేశారని కక్ష సాధింపు చర్యలుగా పోలీసులపై తప్పుడు దుష్పచారం చేస్తున్నారని చెబుతున్నారు. సురేష్‌, ప్రవిజ దంపతలు పోలీస్ స్టేషన్‌ కు వచ్చి చేసిన హంగామా మొత్తం ఆధారాలతో సహా ఉన్నాయంటున్నారు పోలీసులు. ఈ ఇద్దరూ భార్య భర్తలపై గతంలో కూడా జూబ్లీహిల్స్ పీఎస్ లో కేసు నమోదై ఉందని, ఇలా మోసాలు చేసి పోలీసులనే బెదిరించడం వీరి ప్రవృత్తి అంటున్నారు పోలీసులు. కేవలం కక్ష సాధింపు చర్యగానే పోలీసులు వెల్లడించారు. ప్రజలను, పోలీసులను బెదిరించి పబ్బం గడుపుకొనే వారిని చూస్తూ ఊరుకోబోమని, చట్టరిత్యా కఠిన చర్యలు తీసుకుంటామంటున్నారు పోలీసులు. ఇదిలా ఉంటే, అటు వాసుదేవ్‌ శర్మ కూడా జరిగిన ఘటనపై వివరణ ఇచ్చారు వాసుదేవ్‌ శర్మ..తన నుంచి అప్పు తీసుకుని అడిగితే చెల్లించకుండా తమకు పెద్దల అండదండలున్నాయని, నువ్వేమి చేయలేవంటూ బెదిరించడంతో పోలీసులను ఆశ్రయించినట్టుగా చెప్పాడు. అంతేకాదు, సురేష్‌ చాలా ప్రమాదకరమైన వ్యక్తి అని, డబ్బుల కోసమే ఇదంతా చేస్తున్నాడని చెప్పాడు.

ఓట్స్‌ అందం..! ఇలా చేస్తే వావ్‌ అనిపించే సౌందర్యం మీ సొంతం
ఓట్స్‌ అందం..! ఇలా చేస్తే వావ్‌ అనిపించే సౌందర్యం మీ సొంతం
తవ్వకాల్లో బయటపడ్డ కృష్ణుడి విగ్రహం.. కట్ చేస్తే.. షాకింగ్ నిజంతో
తవ్వకాల్లో బయటపడ్డ కృష్ణుడి విగ్రహం.. కట్ చేస్తే.. షాకింగ్ నిజంతో
మహిళల్లో హార్మోనల్ ఇన్‌బ్యాలెన్స్.. కారణాలు ఇవే!
మహిళల్లో హార్మోనల్ ఇన్‌బ్యాలెన్స్.. కారణాలు ఇవే!
పెట్రోలు బంకు వద్ద పార్క్ చేసిన ఏటీఎం వ్యాన్ లో భారీ చోరీ..
పెట్రోలు బంకు వద్ద పార్క్ చేసిన ఏటీఎం వ్యాన్ లో భారీ చోరీ..
మీ దిమాక్‌లో దమ్ముందా.? మరైతే ఈ ఫోటోలో పిల్లిని కనిపెట్టండి..
మీ దిమాక్‌లో దమ్ముందా.? మరైతే ఈ ఫోటోలో పిల్లిని కనిపెట్టండి..
ఛీ..ఛీఆడాళ్లు మరీ ఇలా తయారయ్యారేంట్రా బాబు..చికెన్ షాపులోఇదేందమ్మ
ఛీ..ఛీఆడాళ్లు మరీ ఇలా తయారయ్యారేంట్రా బాబు..చికెన్ షాపులోఇదేందమ్మ
ధోని ఎంట్రీతో ఉలిక్కిపడిన డికాక్ భార్య.. ఫ్యాన్స్‌కు వార్నింగ్
ధోని ఎంట్రీతో ఉలిక్కిపడిన డికాక్ భార్య.. ఫ్యాన్స్‌కు వార్నింగ్
సమ్మర్‌లో తాటి ముంజలు తింటే.. లెక్కలేనన్ని ఆరోగ్య ప్రయోజనాలు!
సమ్మర్‌లో తాటి ముంజలు తింటే.. లెక్కలేనన్ని ఆరోగ్య ప్రయోజనాలు!
భూమ్మీద జీవించిన అతిపెద్ద పాము.. సాక్షాత్తు పరమేశ్వరుడితో లింక్..
భూమ్మీద జీవించిన అతిపెద్ద పాము.. సాక్షాత్తు పరమేశ్వరుడితో లింక్..
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
ఢిల్లీలో బికినీతో బస్సెక్కిన మహిళ..! నెటిజన్స్ కామెంట్స్ షాకే.!
ఢిల్లీలో బికినీతో బస్సెక్కిన మహిళ..! నెటిజన్స్ కామెంట్స్ షాకే.!
చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.
చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.