‘కాళేశ్వరం’ తెచ్చిన సంబరాలు.. సంతోషంలో మత్య్సకారులు

కేసీఆర్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్ట్‌తో వేలాదిమంది రైతులే కాదు మిగిలిన వృత్తుల వారు కూడా సంతోషంలో ఉన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్‌తో ప్రధాన జలాశయాలన్నీ నిండిపోగా.. ఎల్లంపల్లి, మిడ్ మానేరు, లోయర్ మానేరు డ్యామ్‌లు నిండుకుండల్లా తయారయ్యాయి. అంతేకాదు పైనుంచి నీరు వస్తుండటంతో చేపలు కూడా ఎక్కువగా వస్తున్నాయి. దీంతో మత్స్య సంపద కూడా పెరగడంతో మత్స్యకారులు ఆనందంలో ఉన్నారు. ప్రస్తుతం ఎల్లంపల్లి, మిడ్ మానేరు, లోయర్ మానేరు డ్యామ్‌ల్లో పలు రకాల చేపలు లభిస్తున్నాయి. […]

'కాళేశ్వరం' తెచ్చిన సంబరాలు.. సంతోషంలో మత్య్సకారులు
Follow us

| Edited By:

Updated on: Jan 08, 2020 | 1:53 PM

కేసీఆర్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్ట్‌తో వేలాదిమంది రైతులే కాదు మిగిలిన వృత్తుల వారు కూడా సంతోషంలో ఉన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్‌తో ప్రధాన జలాశయాలన్నీ నిండిపోగా.. ఎల్లంపల్లి, మిడ్ మానేరు, లోయర్ మానేరు డ్యామ్‌లు నిండుకుండల్లా తయారయ్యాయి. అంతేకాదు పైనుంచి నీరు వస్తుండటంతో చేపలు కూడా ఎక్కువగా వస్తున్నాయి. దీంతో మత్స్య సంపద కూడా పెరగడంతో మత్స్యకారులు ఆనందంలో ఉన్నారు.

ప్రస్తుతం ఎల్లంపల్లి, మిడ్ మానేరు, లోయర్ మానేరు డ్యామ్‌ల్లో పలు రకాల చేపలు లభిస్తున్నాయి. అంతేకాదు వాటి సైజ్ కూడా పెరిగింది. గతంలో రెండు, మూడు కిలోల చేపలు అరుదుగా దొరుకుతుండగా.. ఇప్పుడు 10 నుంచి 15కిలోల వరకు బరువు ఉంటున్నాయి. మరోవైపు సముద్రంలో దొరికే చేపల కన్నా.. జలశయాల్లో ఉన్న చేపలకు డిమాండ్ అధికంగా ఉండటంతో మత్స్యకారులకు ఉపాధి పెరిగింది. ఇక ఇక్కడి నుంచి పలు రకాల చేపలను కోల్‌కత్తా వంటి ప్రదేశాలకు ఎగుమతి చేసి.. మత్య్సకారులు తమ సంపదను పెంచుకుంటున్నారు. ఇక గతేడాది వర్షాలు కూడా బాగా పడటంతో.. ఈ వేసవిలో నీటి ఎద్దడి ఉండకపోవచ్చని, అలాగే చేపలకు ఢోకా ఉండకపోవచ్చని మత్య్సకారులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం బొచ్చ, జెల్ల చేపలకు మంచి డిమాండ్ ఉందని.. తమ ఉపాధి కూడా పెరిగిందని వారు అంటున్నారు.