రాకెట్‌ తయారీలో హైదరాబాద్ స్టార్టప్

స్కైరూట్… హైదరాబాద్‌కు చెందిన స్టార్టప్. హైదరాబాద్‌కు చెందిన ఈ స్టార్టప్ ఒక రాకెట్‌ను తయారు చేస్తోంది. దీన్ని ఒక రోజులోనే అసెంబుల్ చేసి లాంచ్ చేయవచ్చు. ఇది చిన్న శాటిలైట్లను స్పేస్ సెంటర్‌లోకి తీసుకెళ్లనుంది. అంతర్జాతీయంగా చిన్న శాటిలైట్లను నింగిలోకి పంపడం ఇటీవల కాలంలో ఎక్కువైంది. దీనికి డిమాండ్ కూడా ఉంది. వచ్చే దశాబ్ద కాలంలో చిన్న శాటిలైట్ మార్కెట్‌లో బలమైన వృద్ధి నమోదయ్యే అవకాశముంది. అందుకే ఇందులో అధిక మార్కెట్ వాటా లక్ష్యంగా ఈ స్టార్టప్ […]

రాకెట్‌ తయారీలో హైదరాబాద్ స్టార్టప్
Follow us

| Edited By:

Updated on: Apr 17, 2019 | 4:16 PM

స్కైరూట్… హైదరాబాద్‌కు చెందిన స్టార్టప్. హైదరాబాద్‌కు చెందిన ఈ స్టార్టప్ ఒక రాకెట్‌ను తయారు చేస్తోంది. దీన్ని ఒక రోజులోనే అసెంబుల్ చేసి లాంచ్ చేయవచ్చు. ఇది చిన్న శాటిలైట్లను స్పేస్ సెంటర్‌లోకి తీసుకెళ్లనుంది.

అంతర్జాతీయంగా చిన్న శాటిలైట్లను నింగిలోకి పంపడం ఇటీవల కాలంలో ఎక్కువైంది. దీనికి డిమాండ్ కూడా ఉంది. వచ్చే దశాబ్ద కాలంలో చిన్న శాటిలైట్ మార్కెట్‌లో బలమైన వృద్ధి నమోదయ్యే అవకాశముంది. అందుకే ఇందులో అధిక మార్కెట్ వాటా లక్ష్యంగా ఈ స్టార్టప్ అడుగులు వేస్తోంది.

అమెరికా స్పేస్ రీసెర్చ్ సంస్థ నార్తన్ స్కై రీసెర్చ్ నివేదిక ప్రకారం.. గ్లోబల్‌గా 2027 నాటికి దాదాపు 6,500 చిన్న శాటిలైట్లను స్పేస్‌లోకి పంపనున్నారు. కమ్యూనికేషన్స్, రిమోట్ సెన్సింగ్, నావిగేషన్ వంటి వివిధ రకాల సేవల కోసం వీటిని నింగిలోకి పంపనున్నారు. ప్రపంచంలోని మారుమూల ప్రాంతాలకు హైస్పీడ్ బ్రాండ్‌బాండ్ సేవలు అందించేందుకు 3,236 శాటిలైట్లను స్పేస్‌లోకి పంపేందుకు క్యూపర్ ప్రాజెక్ట్‌పై పనిచేస్తున్నామని అమెజాన్ ఫౌండర్ జెఫ్ బెజోస్ ఇటీవలే తెలిపారు.

ఇస్రో మాజీ శాస్త్రవేత్తలైన పవన్ కుమార్ చందన, నాగ భరత్, వాసుదేవన్ సంయుక్తంగా స్కైరూట్‌ స్టార్టప్‌ను ఏర్పాటు చేశారు. ఈ కంపెనీ 2021లో తొలి రాకెట్ లాంచ్ చేసే అవకాశముంది. రాకెట్‌ను అంతరిక్షంలోకి పంపేందుకు అయ్యే వ్యయం మూడో వంతు దిగొస్తుందని స్కైరూట్ పేర్కొంటోంది. రాకెట్ పరీక్షల కోసం డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (డీఆర్‌డీవో)తో భాగస్వామ్యం కుదుర్చుకున్నామని కంపెనీ తెలిపింది.

నభా నటేష్‌తో ట్విట్టర్ లొల్లి.. కానీ దొరికిపోయిన ప్రియదర్శి.!
నభా నటేష్‌తో ట్విట్టర్ లొల్లి.. కానీ దొరికిపోయిన ప్రియదర్శి.!
తెలుగు నటుడి గొప్పతనం.! 100వ సారి రక్త దానం చేసి.. 'చిరు' మెప్పు
తెలుగు నటుడి గొప్పతనం.! 100వ సారి రక్త దానం చేసి.. 'చిరు' మెప్పు
NTR దేవర పై ఫేక్ న్యూస్.! స్టార్ ప్రొడ్యూసర్ సీరియస్..
NTR దేవర పై ఫేక్ న్యూస్.! స్టార్ ప్రొడ్యూసర్ సీరియస్..
తమిళనాడులో ఓటు వేసిన ఆధ్యాత్మిక గురువు సద్గురు జగ్గీ వాసుదేవ్..
తమిళనాడులో ఓటు వేసిన ఆధ్యాత్మిక గురువు సద్గురు జగ్గీ వాసుదేవ్..
హనుమాన్‌ రాముడికి ఇచ్చినట్టే మీ అందరికీ మాటిస్తున్నా! ప్రశాంత్
హనుమాన్‌ రాముడికి ఇచ్చినట్టే మీ అందరికీ మాటిస్తున్నా! ప్రశాంత్
మండుటెండల్లో చల్లని కబురు.. ఉరుములు, మెరుపులతో ఏపీలో వర్షాలు!
మండుటెండల్లో చల్లని కబురు.. ఉరుములు, మెరుపులతో ఏపీలో వర్షాలు!
బయట వారికి అవకాశాలు ఇస్తున్నారు.. ఇక్కడ వారికి నో ఛాన్స్.
బయట వారికి అవకాశాలు ఇస్తున్నారు.. ఇక్కడ వారికి నో ఛాన్స్.
నెట్‌ఫ్లిక్స్ 350 కోట్ల ఆఫర్ ఐకాన్ స్టారా మజాకా|దేవరకొండ రికార్డ్
నెట్‌ఫ్లిక్స్ 350 కోట్ల ఆఫర్ ఐకాన్ స్టారా మజాకా|దేవరకొండ రికార్డ్
రాజమౌళి సినిమా కోసం మహేష్ బాబు లుక్ ఇదే.. వైరల్ అవుతోన్న వీడియో 
రాజమౌళి సినిమా కోసం మహేష్ బాబు లుక్ ఇదే.. వైరల్ అవుతోన్న వీడియో 
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌