ఢిల్లీలో 903 కరోనా పాజిటివ్ కేసులు.. 13మంది మృతి..

కరోనా కరాళ నృత్యానికి ప్రపంచ దేశాలు వణికిపోతున్నాయి. ఈ వైరస్ ఇప్పుడు భారత్ లోనూ విజృంభిస్తోంది. నిజాముద్దీన్‌ ఘటన అనంతరం ఢిల్లీలో కరోనా తీవ్రత మరింత ఎక్కువైంది. మహారాష్ట్ర, తమిళనాడు తరువాత

ఢిల్లీలో 903 కరోనా పాజిటివ్ కేసులు.. 13మంది మృతి..
Follow us

| Edited By:

Updated on: Apr 11, 2020 | 5:29 PM

కరోనా కరాళ నృత్యానికి ప్రపంచ దేశాలు వణికిపోతున్నాయి. ఈ వైరస్ ఇప్పుడు భారత్ లోనూ విజృంభిస్తోంది. నిజాముద్దీన్‌ ఘటన అనంతరం ఢిల్లీలో కరోనా తీవ్రత మరింత ఎక్కువైంది. మహారాష్ట్ర, తమిళనాడు తరువాత అత్యధిక పాజిటివ్‌ కేసులు ఢిల్లీలో నమోదవుతున్నాయి. సెంట్రల్‌ ఢిల్లీలోని చాంద్‌నీ మహల్‌ ప్రాంతంలో కరోనా సోకి ముగ్గురు మరణించారు. నిజాముద్దీన్‌ మర్కజ్‌ సమావేశానికి హాజరై దాదాపు 13ప్రార్థనా మందిరాల్లో నివాసమున్న 102మందిని అదుపులోకి తీసుకున్నారు. వీరందరికీ వైద్యపరీక్షలు నిర్వహించగా వీరిలో 52మందికి కరోనా నిర్ధారణ అయినట్లు జిల్లా అధికారులు వెల్లడించారు.

కోవిద్ 19 ఇప్పుడు దేశంలోని అన్ని ప్రాంతాలకు విస్తరిస్తోంది. తాజాగా వీరిలో ముగ్గురు ఆరోగ్య పరిస్థితి విషమించి చనిపోయినట్లు అధికారులు ప్రకటించారు. వీరితో సన్నిహితంగా మెలిగిన చాలా మందికి వైరస్‌ సోకే అవకాశం ఉన్నట్లు అధికారులు భావిస్తున్నారు. దీంతో ఆ ప్రాంతమంతా సీల్ చేసిన అధికారులు ప్రజలు ఇంటినుంచి బయటకురాకుండా కఠిన చర్యలు తీసుకుంటున్నారు. అంతేకాకుండా ఢిల్లీలో ఒకేరోజు దాదాపు 200 కొవిద్ పాజిటివ్ కేసులు నమోదుకావడంతో నగరంలో 30 హాట్‌స్పాట్‌లను గుర్తించి సీల్‌ చేశారు.

కాగా.. ఢిల్లీలో కరోనా బాధితుల సంఖ్య 903కి చేరగా 13మంది మరణించారు. మొత్తం బాధితుల్లో 450మంది తబ్లిగీలకు సంబంధించినవారే ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు. శనివారంనాటికి దేశవ్యాప్తంగా కరోనా సోకి 239మంది మరణించగా మొత్తం 7447మంది దీని బారినపడ్డారు. గడచిన 24గంటల్లోనే దేశంలో కొత్తగా 40మరణాలు, 1035కేసులు నమోదయ్యాయి. ఇక ప్రపంచవ్యాప్తంగా 16లక్షల మందికి ఈ వైరస్‌ నిర్ధారణ అయ్యింది. వీరిలో లక్షమంది మృతిచెందారు.

Also Read: మూడుసార్లు క్లీన్ సిటీ…నేడు కోవిద్-19 హాట్‌స్పాట్..