Breaking News
  • కడప: వివేకా హత్యపై సీబీఐ విచారణ జరపాలి. బీజేపీ నేతలపై పోలీసులు అక్రమ కేసులు బనాయిస్తున్నారు. సీఏఏకు వ్యతిరేకంగా డిప్యూటీ సీఎం అంజద్‌ రాజీనామా చేయాలి. వైసీపీ ప్రభుత్వానికి ప్రజలు చరమగీతం పాడుతారు-ఆదినారాయణరెడ్డి.
  • రేపు పవన్‌ కల్యాణ్ ఢిల్లీ పర్యటన. కేంద్రీయ సైనిక్‌ బోర్డు కార్యాలయం సందర్శించనున్న పవన్‌. అమరవీరుల సంక్షేమానికి రూ.కోటి అందించనున్న పవన్‌.
  • కృష్ణాజిల్లా: చందర్లపాడు తహశీల్దార్‌ ఆఫీస్‌ ఎదుట రైతు ఆత్మహత్యాయత్నం. పక్కా ఇళ్ల స్థలాలకు తన పొలంలో మట్టి తవ్వుతున్నారని మనస్తాపం. పురుగులమందు తాగబోయిన రైతు, అడ్డుకున్న సిబ్బంది.
  • ప.గో: తాడేపల్లిగూడెం శశి ఇంజినీరింగ్‌ కాలేజ్ విద్యార్థి మృతి. బైక్‌పై నుంచి పడి మృతిచెందాడంటున్న తండ్రి. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు.
  • హైదరాబాద్: మిస్టరీగా మారిన ఆయుష్‌ చాన్‌ బే మృతి, ఈనెల 16న స్నేహితుడి పుట్టిన రోజు అని వెళ్లిన ఆయుష్‌, నిన్న రక్తపు మడుగులో శవమై తేలిన ఆయుష్‌, ఆయుష్‌పై మృతిపై అనుమానాలు.
  • విజయవాడ: అక్రమ కట్టడాలపై ఏసీబీ అధికారుల దాడులు. అనధికారిక అనుమతులపై లోతైన విచారణ. అక్రమంగా నిర్మించిన భవన యజమానులపై చర్యలకు సిఫారసు.

యుఎస్, కెనడాలను కప్పేసిన మంచు తుపాను

winterstorm in us canada, యుఎస్, కెనడాలను కప్పేసిన మంచు తుపాను

అమెరికా, కెనడా వంటి దేశాలను మంచు తుపాను కప్పేసింది. అమెరికాలోని షికాగో, కన్సాస్, నార్త్, సౌత్ డకోటా, న్యూయార్క్, మిన్నెసోటా  వంటి నగరాలను మంచు ముంచెత్తుతోంది. రోడ్లు, చెట్లు, భవనాలమీద మంచు దుప్పటి పరచుకుంది. ఈ దేశాల్లో అనేక ప్రాంతాలనుంచి నడపవలసిన విమాన సర్వీసులను రద్దు చేశారు. రోడ్లపై ట్రాఫిక్ ను నిషేధించారు. కన్సాస్ లో ఒకచోట రోడ్డుపై ప్రయాణిస్తున్న ట్రక్కుడ్రైవర్ మార్గం సరిగా కనబడకపోవడంతో.. తన ట్రక్కును అతివేగంగా నడుపుతూ.. కింద మంచుతో కప్పేసిన పల్లపు భాగంలోకి చొచ్చుకుపోయాడు. అదుపు తప్పిన ఆ వాహనం దూసుకురాగా.. ఒక వ్యక్తి తృటిలో ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు. అప్రమత్తంగా ఉన్న అతగాడు ఒక్క ఉదుటున పక్కకు జంప్ చేసి గాయపడకుండా తప్పించుకోగలిగాడు. అత్యవసరమైతే తప్ప బయటికి రాకూడదని, ఎప్పటికప్పుడు వాతావరణ హెచ్ఛరికలను గమనిస్తూ.. .. అప్రమత్తంగా ఉండాలని అధికారులు ప్రకటిస్తున్నారు.. స్పేస్ ఎక్స్  సంస్థ తన అత్యంత ఆధునిక రాకెట్ ప్రయోగాన్ని వాయిదా వేసుకుంది. ఇక  కెనడాలోనూ దాదాపు ఇదే పరిస్థితి నెలకొంది. సిడ్నీ, మెల్ బోర్న్ వంటి నగరాల్లో అలర్ట్ వార్నింగ్స్ జారీ చేశారు. బ్రిటన్ లో సైతం ఇంచుమించు ఇదే వాతావరణం కొనసాగుతోంది.winterstorm in us canada, యుఎస్, కెనడాలను కప్పేసిన మంచు తుపానుwinterstorm in us canada, యుఎస్, కెనడాలను కప్పేసిన మంచు తుపాను

 

 

 

Related Tags