Breaking News
  • కేంద్రమంత్రి నరేంద్రసింగ్‌ తోమర్‌కు చంద్రబాబు లేఖ. నరేగా పెండింగ్‌ నిధులను వెంటనే విడుదల చేయాలని వినతి. ఏపీ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతూ.. నిధులు విడుదల చేయకుండా పెండింగ్‌లో ఉంచింది. గతంలో నరేగా పనులు చేసినవారిపట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది -లేఖలో చంద్రబాబు.
  • పదేళ్లలో జమ్మికుంట-హుజూరాబాద్‌ నగరాలు కలిసిపోతాయి. జంట నగరాలకు మున్సిపల్ చైర్మన్లుగా టీఆర్‌ఎస్ అభ్యర్థులే గెలుస్తారు. ఎన్నికల్లో ఓడిపోయినా ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడిగా.. కేసీఆర్‌ నన్ను నియమించారు-వినోద్‌కుమార్‌. కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ప్రకటించాలి -ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్.
  • కడప: పోరుమామిళ్ల మండలం మార్కాపురం దగ్గర గుర్తుతెలియని వాహనం ఢీకొని సిలాస్‌ అనే వ్యక్తికి తీవ్రగాయాలు, ఆస్పత్రికి తరలింపు.
  • నగరపాలక, మున్సిపల్‌ ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు పూర్తిచేశాం. 120 మున్సిపాలిటీలు, 9 కార్పొరేషన్లలో రేపు ఓట్ల లెక్కింపు. ఈ నెల 27న మేయర్లు, చైర్‌పర్సన్ల ఎన్నికకు పరోక్ష ఎన్నికలు. ఈనెల 29న కరీంనగర్‌ మేయర్‌ ఎన్నిక-నాగిరెడ్డి. రేపు సాయంత్రంలోగా అన్ని ఫలితాలు వస్తాయి. పార్టీలు మేయర్‌, చైర్‌పర్సన్ల పేర్లను ఏ, బీ ఫారాల ద్వారా ఇవ్వాలి. ఈ నెల 26న ఉ.11 గంటలలోగా ఏ ఫామ్‌ ఇవ్వాలి. ఈ నెల 27న ఉ.11 గంటలలోగా బీ ఫామ్‌ ఇవ్వాలి -తెలంగాణ ఎన్నికల కమిషనర్‌ నాగిరెడ్డి.
  • శాసనమండలి తీరుపై ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్‌ ఆగ్రహం. మంచి వ్యక్తితో తప్పుడు పనిచేయించిన చంద్రబాబును ఎవరూ క్షమించరు. వైసీపీ ఎమ్మెల్యేలను రాజీనామా చేయమని అడిగే హక్కు టీడీపీకి లేదు. ముందు టీడీపీ ఎమ్మెల్యేలు రాజీనామా చేసి.. ఎన్నికలకు వెళ్లాలి -ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్.

విండీస్‌ ఫ్లేయర్ పై 4 వన్డేల నిషేధం

, విండీస్‌ ఫ్లేయర్ పై 4 వన్డేల నిషేధం

దుబాయి: ఇంగ్లండ్‌ క్రికెట్‌ కెప్టెన్‌ జోరూట్‌ను ‘గే’ గా  టీజ్ చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న వెస్టిండీస్‌ పేసర్‌ షెనాన్‌ గాబ్రియెల్‌పై నాలుగు వన్డేల నిషేధం విధిస్తూ అంతర్జాతీయ క్రికెట​ ఐసీసీ) నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు గాబ్రియెల్‌పై విచారణ చేపట్టిన అనంతరం తదుపరి చర్యలకు సిద్ధమైంది. గాబ్రియెల్‌పై నాలుగు వన్డేల నిషేధం పాటు మ్యాచ్‌ ఫీజులో 75శాతం కోత విధించింది. తాజా ఘటన తర్వాత గాబ్రియెల్‌ ఖాతాలో మూడు డీమెరిట్‌ పాయింట్లు చేరాయి. దాంతో అతని మొత్తం డీమెరిట్‌ పాయింట్ల సంఖ్య ఎనిమిదికి చేరింది. ఈ పాయింట్లు ఒక టెస్టు మ్యాచ్‌ నిషేధానికి లేక నాలుగు వన్డేల నిషేధానికి సమానం. ఈ క్రమంలోనే గాబ్రియెల్‌పై నాలుగు వన్డేల నిషేధం విధించేందుకు ఐసీసీ సిద్ధమైంది.

ఇంగ్లండ్‌-వెస్టిండీస్‌ మూడో టెస్టులో భాగంగా జో రూట్- షానన్‌ గాబ్రియల్‌ మధ్య మాటల యుద్ధం జరిగింది. మూడో రోజు ఆట లో జో రూట్‌-జో డెన్లీలు బ్యాటింగ్‌ చేస్తున్న సమయంలో విండీస్‌ పేసర్‌ గాబ్రియల్‌ దురుసుగా ప్రవర్తించాడు. ఈ క్రమంలోనే జో రూట్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశాడు. అయితే గాబ్రియల్‌ చేసిన వ్యాఖ్యలు మైక్‌లో స్పష్టత లేకపోయినప్పటికీ, జో రూట్‌ మాత్రం ‘గే’ అయితే తప్పేంటి అనే సమాధానం ఇవ్వడం మాత్రం రికార్డు అయ్యింది. దాంతో జో రూట్‌ను గే గా సంబోంధించడానే అభియోగాలపై ఐసీసీ విచారణ చేపట్టింది. అనంతరం గాబ్రియెల్‌పై డీమెరిట్‌ పాయింట్ల ఆధారంగా నాలుగు వన్డేల నిషేధం విధించింది.