ఆదివారం వైన్ షాపులు కూడా బంద్…

కరోనా కట్టడి చర్యల్లో భాగంగా ఈ ఆదివారం ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు  దేశ ప్రజలంతా జనతా కర్ఫ్యూ పాటించాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. అయితే తెలంగాణ సీఎం కేసీఆర్ జనతా కర్ఫ్యూను మరికొంత పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఆదివారం ఉదయం 6 గంటల నుంచి సోమవారం ఉదయం 6 గంటల వరకు ప్రజలంతా ఇళ్లకే పరిమితమవ్వాలని పిలుపునిచ్చారు. దీంతో రేపు ఆర్టీసీ బస్సులు, మెట్రోలు సర్వీసులు సైతం […]

ఆదివారం వైన్ షాపులు కూడా బంద్...
Follow us

|

Updated on: Mar 21, 2020 | 6:35 PM

కరోనా కట్టడి చర్యల్లో భాగంగా ఈ ఆదివారం ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు  దేశ ప్రజలంతా జనతా కర్ఫ్యూ పాటించాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. అయితే తెలంగాణ సీఎం కేసీఆర్ జనతా కర్ఫ్యూను మరికొంత పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఆదివారం ఉదయం 6 గంటల నుంచి సోమవారం ఉదయం 6 గంటల వరకు ప్రజలంతా ఇళ్లకే పరిమితమవ్వాలని పిలుపునిచ్చారు. దీంతో రేపు ఆర్టీసీ బస్సులు, మెట్రోలు సర్వీసులు సైతం నిలిపివేయబడ్డాయి. పాలు, కూరగాయలు లాంటి నిత్యావసరాల షాపులు, పెట్రోల్ బంక్‌లు నిర్వహించుకునేందుకు అనుమతించారు.

ఈ నేపథ్యంలో రేపు తెలంగాణలో వైన్ షాపులు కూడా బంద్ కానున్నాయి. ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా 2,400 వైన్ షాపులు మూతపడనున్నాయి. వైన్ షాపులు మూసివేస్తున్నట్టు తెలంగాణ వైన్స్ డీలర్స్ అసోసియేషన్ ప్రకటన విడుదల చేసింది. కాగా ఇప్పటికే స్టేట్‌లో 700 బార్లు మూతపడ్డాయి.