Breaking News
  • ప్రధాని శంకుస్థాపన చేసిన రాజధానిని మార్చే హక్కు ఎవరికీ లేదు. సుప్రీంకోర్టు, రాష్ట్రపతి ఒప్పుకుంటేనే హైకోర్టు కదులుతుంది-కేశినేని. అమరావతి రక్షణకు పార్లమెంటు వేదికగా పోరాటం చేస్తాం-కేశినేని.
  • చిత్తూరు: తిరుచానూరు పీఎస్‌ నుంచి బేడీలతో పరారైన దొంగ. ట్రాక్టర్‌ దొంగతనం కేసులో నాగరాజును అరెస్ట్‌చేసిన పోలీసులు. దొంగ నాగరాజు కోసం గాలిస్తున్న పోలీసులు.
  • ఢిల్లీ: ఆప్‌ ప్రభుత్వంపై బీజేపీ తీవ్ర విమర్శలు. నిర్భయ దోషులను రక్షించేందుకు ఆప్‌ ప్రభుత్వం యత్నిస్తోంది. కావాలనే న్యాయ ప్రక్రియను ఆలస్యం చేస్తోంది-మనోజ్‌ తివారీ. పోలీసులు తమ పరిధిలో లేరని తప్పించుకోవాలని ఆప్‌ చూస్తోంది -బీజేపీ ఢిల్లీ చీఫ్‌ మనోజ్‌ తివారీ.
  • అనంతపురం: తాడిపత్రిలో కత్తిపోట్లు. డబ్బుల విషయంలో స్నేహితుల మధ్య ఘర్షణ. రాము అనే వ్యక్తిని కత్తితో పొడిచిన రవితేజ. ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందిన రాము.
  • రైతులు కన్నీళ్లు పెట్టినా సీఎం మనసు కరగడం లేదు. రాష్ట్రంలో పోలీస్‌ రాజ్యం నడుస్తోంది-దేవినేని ఉమ. విశాఖలో భూదందా నడుస్తోంది-మాజీ మంత్రి దేవినేని ఉమ. రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం కోసం రాజధానిని విశాఖకు తరలిస్తున్నారు. పులివెందుల పులి డమ్మీ కాన్వాయ్‌తో వెళ్తోంది. దేశ చరిత్రలో డమ్మీ కాన్వాయ్‌తో వెళ్లిన సీఎం చరిత్రలో లేరు. సచివాలయానికి వెళ్లేందుకు మెటల్‌ రోడ్డు వేసుకుంటున్నారు. 5 కోట్ల మంది ప్రజలు రేపు రోడ్లపైకి రావాలి-దేవినేని ఉమ.

మీరు వృద్దాప్యంలో ఉన్నారా… అయితే మద్యపానం మీకు మంచిదే..

, మీరు వృద్దాప్యంలో ఉన్నారా… అయితే మద్యపానం మీకు మంచిదే..

మద్యపానం అనడంతోనే ఆరోగ్యానికి హానీకరం అని అందరూ అభిప్రాయపడతారు. అయితే ఇది అందరికీ కాదు.. కొందరికి మాత్రమే.. అలా అని అన్ని వయస్సుల వారికి కాదు.. ఓ వయస్సులో ఉన్నవారికే.. ఓ వయస్సులో ఉన్నవారికి మద్యం తాగడం ఆరోగ్యదాయకమని తేలింది. మద్యపానంపై పరిశోధన చేపట్టిన మంచెస్టర్ లోని బోస్టన్ మెడికల్ బృందం ఈ విషయాన్ని తెలిపింది.

యూఎస్ లో పరిశోధన చేపట్టిన వైద్య బృందం మద్యపానం ఏటా 1500 మరణాలను నిరోధిస్తుందని తేల్చారు. వీరు అన్ని వయస్సుల వారిపై ప్రత్యేకంగా పరిశోధనలు చేపట్టారు. ముఖ్యంగా 20 నుంచి 49 ఏళ్లలోపు మద్యం సేవించే వారిని పరిశీలించారు. అలాగే 65 వయస్సు దాటిన వృద్ధులపై కూడా పరిశోధనలు చేపట్టారు. బోస్టింగ్ వైద్యం బృందంలోని డాక్టర్ నైమీ మద్యపానం గురించి పలు ఆసక్తికరమైన విషయాలను తెలిపారు. పదేళ్ల క్రితం వరకు మద్యపానం ఆరోగ్యానికి మంచిదే అన్న అభిప్రాయం ఉండేదని తెలిపారు. అయితే తాను చేపట్టిన పరిశోధనలో అల్కాహాల్ అనేది ఓ వయస్సు వారికే ఆరోగ్యమని తేలిందని పేర్కొన్నారు. ముఖ్యంగా 20 నుంచి 49 ఏళ్లలోపు ఉన్న వారు మద్యం సేవించడం ద్వారా బ్రెస్ట్ క్యాన్సర్, గ్యాస్ట్రిటిస్, లివర్ క్యాన్సర్, వంటి రోగాల బారిన పడుతున్నారని తెలిపారు. అంతేకాదు వీరిలో దాదాపు 40 నుంచి 50 శాతం మంది ఈ రోగాలతో మరణిస్తున్నారన్నారు.

, మీరు వృద్దాప్యంలో ఉన్నారా… అయితే మద్యపానం మీకు మంచిదే..

యూఎస్ లో 2006-10 మధ్య మరణించిన వారిలో దాదపు 36శాతం అల్కాహాల్ ప్రభావంతో మరణించిన వారేనని తేలింది. ఈ చనిపోయిన 36శాతం మందిలో దాదపు లివర్ క్యాన్సర్, ప్యాంక్రియాటైటిస్ వంటి రోగాలతోనే అని తేలింది. అయితే ఈ వయస్సులో ఉన్న వారు కేవలం 4.5శాతం మంది మాత్రమే ఆరోగ్యంగా ఉంటున్నారని తేలింది. అది కూడా వారు తీసుకునే మద్యం మోతాదుగా ఉండడమే కారణమని డాక్టర్ నైమీ తెలిపారు.

, మీరు వృద్దాప్యంలో ఉన్నారా… అయితే మద్యపానం మీకు మంచిదే..

మద్యం సేవిస్తున్న 65 ఏళ్ల వారిపై జరిపిన పరిశోధనలో పలు ఆసక్తి కర విషయాలు బయటపడ్డాయి. వృద్దాప్య దశలో రోజుకు ఓ పెగ్గు మద్యం సేవించే వారు ఆరోగ్యంగా ఉంటున్నట్లు తెలిపారు. అంతేకాదు ఆ వయస్సులో రోజుకు కాస్త మద్యం సేవిచడం ద్వారా వారి జీవితకాలం కూడా పెరుగుతోందని తెలిపారు. ఆ వయస్సులో సాధారణ రోగాలు వీరి దరిచేరవని డాక్టర్ నైమీ అన్నారు. మొత్తానికి బోస్టన్ వైద్య బృందానికి చెందిన డాక్టర్ నైమీ చెప్పిన ప్రకారం 50ఏళ్లలోపు ఉన్నవారు మద్యం సేవించడం అనారోగ్యానికి దారితీస్తోందని.. అదే 65ఏళ్లపై బడ్డ వారు మద్య సేవించడం ఆరోగ్యదాయకమని అన్నారు. అంతే కాదు ఈ వయస్సులో ఉన్నవారు మితంగా మద్యం సేవించడం ద్వారా రోగాల బారిన పడుకుండా ఉంటారని డాక్టర్ నైమీ పేర్కొన్నారు.