Breaking News
  • ఆదిలాబాద్‌: నేటి నుంచి నాగోబా జాతర. ఇంద్రవెళ్లి మండలం కేస్లాపూర్‌లో ప్రారంభంకానున్న జాతర. జాతరకు రానున్న తెలంగాణ, మహారాష్ట్ర, ఒడిశా.. మధ్యప్రదేశ్‌ రాష్ట్రాల ఆదివాసీలు, గిరిజనులు.
  • అవినీతి సూచిలో భారత్‌కు 80వ స్థానం. ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతిపై వ్యాపారవర్గాలు నుంచి.. వివరాలు సేకరించిన ట్రాన్స్‌పరెన్సీ ఇంటర్నేషనల్‌ సంస్థ. అవినీతి కట్టడిలో తొలిస్థానంలో నిలిచిన డెన్మార్క్‌, న్యూజిలాండ్‌.
  • వలసల నియంత్రణకు ట్రంప్‌ సర్కార్‌ మరో కీలక చర్య. అమెరికా వచ్చే విదేశీ గర్భిణులపై ఆంక్షలు విధింపు. కాన్పు కోసమే అమెరికా వచ్చేవారికి పర్యాటక వీసా నిరాకరణ.
  • రోహింగ్యాల ఊచకోతపై అంతర్జాతీయ న్యాయస్థానం సంచలన తీర్పు. మయన్మార్‌లో రోహింగ్యాల నరమేధం జరిగింది. సైన్యం అండతో రోహింగ్యాలను ఊచకోత కోశారన్న న్యాయస్థానం. రోహింగ్యాలను రక్షించడానికి వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశం.
  • కరోనా వైరస్‌కు కారణం పాములే. చైనా అధ్యయనంలో వెల్లడి. ఐదు నగరాలకు రాకపోకలన్నీ నిలిపివేసిన చైనా. వుహాన్‌, హుయాంగ్‌గాంగ్‌, ఎఝౌ, ఝిజియాంగ్‌.. ఖియాన్‌జింగ్‌ నగరాలపై రవాణా ఆంక్షలు విధింపు.

సేతుపతి ‘సైరా’ను కోలీవుడ్‌లో గట్టెక్కిస్తాడా.?

Will Vijay Sethupathi stardom help Sye Raa to bag success in Kollywood?, సేతుపతి ‘సైరా’ను కోలీవుడ్‌లో గట్టెక్కిస్తాడా.?

మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో దర్శకుడు సురేందర్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం ‘సైరా నరసింహారెడ్డి’. తొలి తెలుగు ఫ్రీడమ్ ఫైటర్ ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా రూపొందిన ఈ సినిమా తెలుగుతో పాటు తమిళ, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో అక్టోబర్ 2న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. చిరు 151వ సినిమాగా దాదాపు 270 కోట్ల వ్యయంతో హీరో రామ్ చరణ్ నిర్మించిన ఈ మూవీలో బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్, సుదీప్, విజయ్ సేతుపతి, నయనతార, తమన్నా తదితరులు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ అమిత్ త్రివేది సంగీతం అందించారు. ఇకపోతే ఈ సినిమాకి తమిళనాడులో క్రేజ్ ఎలా వస్తుంది అన్న సందేహం చాలామందిలో ఉంది. పబ్లిసిటీ విషయంలో సోషల్ మీడియా వేదికగా అనేక రూమర్లు వస్తున్నాయి.

మెగాస్టార్ చిరంజీవికి తెలుగులో విపరీతమైన మార్కెట్ ఉన్న సంగతి అందరికి తెలిసిందే. అయితే కోలీవుడ్‌లో మాత్రం అంతగా లేదు. కానీ ‘సైరా’ సినిమాలో లేడి సూపర్‌స్టార్ నయనతార, మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి కీలక పాత్రలు పోషిస్తున్నారు. తమిళనాట వీళ్లకు ఉన్న క్రేజ్ సినిమాకు ఎంతవరకు పనికొస్తుందో అనేది చూడాలి. ఇది ఇలా ఉండగా హీరోయిన్ నయనతార ప్రీ-రిలీజ్ ఈవెంట్లకు, ఫంక్షన్స్‌కు రావడం చాలా తక్కువ. ‘సైరా’కు ఆమె ఇంతవరకు ప్రమోషన్స్ కూడా మొదలు పెట్టలేదు. కాగా ఆదివారం జరగబోయే ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కు నయన్ వస్తుందా.? అనే నమ్మకం లేదు. రామ్ చరణ్ పర్సనల్‌గా రిక్వెస్ట్ చేసినా పట్టించుకోలేదని ఇన్‌సైడ్ టాక్. మరి తమిళనాట నిర్వహించే మీడియా సమావేశాలకైనా ఆమె విచ్చేస్తుందా లేదా అనేది ఇప్పుడు కోలీవుడ్‌లో హాట్ టాపిక్.

ఇక హీరో విజయ్ సేతుపతి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అనధి కాలంలోనే తమిళనాట స్టార్ హీరోగా ఎదిగాడు. అజిత్ కుమార్, విజయ్‌ల తర్వాత విజయ్ సేతుపతికి కోలీవుడ్‌లో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. తమిళ ప్రేక్షకులు ముద్దుగా ‘మక్కల్ సెల్వన్’ అని పిలుచుకునే సేతుపతి.. ‘సైరా’లో కీలక పాత్ర పోషించాడు. ఇంకా చెప్పాలంటే కథలో చాలా కీలకమైన పాత్ర అని తెలుస్తోంది. అంతేకాకుండా ఈ మధ్య సోషల్ మీడియాలో ఓ రూమర్ హల్చల్ చేసింది. చిరంజీవిని డామినేట్ చేసేలా సేతుపతి పాత్ర ఉండటంతో.. ఆ పాత్ర సీన్లు కొన్ని కట్ చేయాలనీ దర్శక నిర్మాతలు భావిస్తే.. స్వయంగా చిరంజీవే రంగంలోకి దిగి.. ఒక్క సన్నివేశం కూడా తొలగించకూడదని చెప్పినట్లు వార్తలు వచ్చాయి. ఒకవేళ ఇదే నిజమైతే.. సినిమాలో సేతుపతిది బలమైన క్యారెక్టర్ అయితే.. ఖచ్చితంగా తమిళనాట ఓపెనింగ్స్ అదిరిపోవడం ఖాయం. అంతేకాకుండా విజయ్ సేతుపతి సినిమా వచ్చిందంటే చాలు తమిళ తంబీలు థియేటర్ల వద్ద క్యూ కడతారు. ఇటీవల విడుదలై బ్లాక్ బస్టర్ గా నిలిచిన సేతుపతి సినిమా ‘సూపర్ డీలక్స్’ ఇందుకు నిదర్శనం. ఈ నేపథ్యంలో ‘సైరా’కు కూడా కోలీవుడ్ లో ఓపెనింగ్స్ అదరాలంటే.. సేతుపతి సెంటిమెంటే బలమైన కారణంగా నిలుస్తుంది.