ఆ నలుగురినీ ఉరి తీస్తా .. నా కూతురి పెళ్లి చేస్తా

నిర్భయ కేసులో నలుగురు దోషులనూ తాను ఉరి తీస్తానని, అందుకు ప్రభుత్వం ఇచ్ఛే లక్ష రూపాయల పారితోషికంతో తన కూతురి పెళ్లి జరిపిస్తానని అంటున్నాడు మీరట్ తలారి పవన్ జలాద్. తనకు ఈ అవకాశం  ఇచ్చినందుకు యూపీ ప్రభుత్వానికి, తీహార్ జైలు అధికారులకు, భగవంతుడికి కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నానని చెప్పాడు. తన కుమార్తె వివాహానికి తనకు డబ్బులు అవసరమని, ఈ కేసులో దోషుల ఉరితీత కోసం  తాను నాలుగు నెలలుగా వేచి ఉన్నానని అన్నాడు. మీరట్ లోని  […]

ఆ నలుగురినీ ఉరి తీస్తా .. నా కూతురి పెళ్లి చేస్తా
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: Jan 11, 2020 | 2:55 PM

నిర్భయ కేసులో నలుగురు దోషులనూ తాను ఉరి తీస్తానని, అందుకు ప్రభుత్వం ఇచ్ఛే లక్ష రూపాయల పారితోషికంతో తన కూతురి పెళ్లి జరిపిస్తానని అంటున్నాడు మీరట్ తలారి పవన్ జలాద్. తనకు ఈ అవకాశం  ఇచ్చినందుకు యూపీ ప్రభుత్వానికి, తీహార్ జైలు అధికారులకు, భగవంతుడికి కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నానని చెప్పాడు. తన కుమార్తె వివాహానికి తనకు డబ్బులు అవసరమని, ఈ కేసులో దోషుల ఉరితీత కోసం  తాను నాలుగు నెలలుగా వేచి ఉన్నానని అన్నాడు. మీరట్ లోని  అధికారులు ఇతనికి ప్రత్యేకంగా ఓ ఇంటిని కేటాయించి.. జిల్లా వదిలి వెళ్లరాదని కోరారట. ‘ నాకు యూపీ ప్రభుత్వం నెలకు కేవం 5 వేల రూపాయల జీతాన్ని చెల్లిస్తోంది. ఈ రోజుల్లో ఇది ఏమాత్రం సరిపోతుంది చెప్పండి.. నేను ఉంటున్న ఇల్లు కూడా శిథిలావస్థలో ఉంది.. ఈ కేసులోని నలుగురు దోషుల ఉరితో కొంత ఊరట పొందుతాను కూడా ‘ అన్నాడు పవన్ జలాద్.  ఒక్కో వ్యక్తినీ ఉరి తీసినందుకు 25 వేల రూపాయలు చెల్లిస్తారని, ఇప్పుడు నలుగురు దోషులున్నారు గనుక తనకు మొత్తం లక్ష వరకు ‘ రివార్డు ‘ వస్తుందని ఆశగా చెప్పాడు.  నిర్బయ కేసులో దోషులను ఈ నెల 22 వ తేదీ ఉదయం 7 గంటలకు ఉరి తీయాలని ఢిల్లీ కోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే. అటు-పవన్ జలాద్ తండ్రి మామూ జలాద్ కూడా తలారే.. ఈ వంశంలో పవన్ జలాద్ నాలుగో తరం తలారి అట.