చెరుకు రసం అందాన్ని పెంచుతుందా..?

చెరుకు రసం వల్ల ఎన్నో ఫలితాలుంటాయన్నది నిజం. శరీర ఉష్ణోగ్రతని నియంత్రించే శక్తి చెరుకు రసానికి ఉందన్నది నమ్మకం. వేసవి వచ్చిందంటే చాలు చెరుకురసానికి విపరీతమైన డిమాండ్ పెరుగుతుంది. అయితే చెరుకురసం ముఖానికి పట్టిస్తే.. కోమలంగా తయారవుతుందట.. అందం రెట్టింపు అవుతుందట. ఇదే వార్త ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో హల్‌చల్ చేస్తోంది.

అయితే.. అందులో నిజం లేదని కొట్టి పారేస్తున్నారు స్కిన్ స్పెషలిస్టులు, బ్యుటీషియన్స్. చెరుకురసం వల్ల రక్తంలో గ్లూకోజ్, చెక్కెర స్థాయిలు పెరుగుతాయే కానీ.. చర్మ వ్యాధులు తగ్గవని నిపుణులు చెప్తోన్న మాట. ఎక్కువగా పండ్లు తినడం వల్ల చర్మ సౌందర్య పెరుగుతుందని.. చెరుకు రసం వల్ల ఎటువంటి ఉపయోగం లేదని తేలింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *