Breaking News
  • నెల్లూరు: సైదాపురం తహశీల్దార్‌ చంద్రశేఖర్‌ సస్పెన్షన్‌. అవినీతి ఆరోపణలు రుజువు కావడంతో చంద్రశేఖర్‌తో పాటు.. వీఆర్‌వోతో, తహశీల్దార్‌ ఆఫీస్‌ ఉద్యోగిని సస్పెండ్‌ చేసిన కలెక్టర్‌.
  • టీవీ9కు అవార్డుల పంట. ఎక్సేంజ్‌ ఫర్‌ మీడియా న్యూస్‌ బ్రాడ్‌కాస్టింగ్‌ అవార్డుల్లో.. టీవీ9కు మూడు అవార్డులు. పుల్వామా దాడి కవరేజ్‌కు బెస్ట్ న్యూస్ కవరేజ్ అవార్డు అందుకున్న.. విజయవాడ బ్యూరో చీఫ్‌ హసీనా. మరో రెండు విభాగాల్లో టీవీ9కు అవార్డులు. బిగ్‌ న్యూస్‌ బిగ్‌ డిబేట్‌ కార్యక్రమానికి.. సౌత్‌ ఇండియాలోనే బెస్ట్‌ యాంకర్‌గా రజినీకాంత్‌కు అవార్డు. టీవీ9 టాస్క్‌ఫోర్స్‌ బ్లాక్‌మ్యాజిక్‌ కార్యక్రమానికి మరో అవార్డు. అద్రాస్‌పల్లిలోని 'చితిపై మరో చితి' బాణామతి కథనానికి.. బెస్ట్‌ లేట్‌ ప్రైమ్‌టైం షో అవార్డు.
  • కశ్మీర్‌కు ప్రత్యేక హోదాను రద్దు చేసిన కేంద్రం. స్థానికుల ప్రయోజనాలను కాపాడుతామని హామీ. త్వరలో ప్రత్యేక హోదా స్థానంలో కొత్త చట్టాన్ని తీసుకొస్తాం -కేంద్రమంత్రి జితేందర్‌సింగ్‌.
  • రామానాయుడు స్టూడియోలో ప్రెషర్‌ కుక్కర్‌ సినిమా చూసిన కేటీఆర్‌. ప్రెష్‌ ఎనర్జీ, మంచి మెసేజ్‌తో సినిమా ఉంది. డాలర్‌ డ్రీమ్స్‌ కోసం అందరూ అమెరికాకు పరుగులు పెడుతున్నారు. కథలోని కంటెంట్‌ను అందరికీ అర్ధమయ్యేలా సినిమా తీశారు-మంత్రి కేటీఆర్‌.
  • తూ.గో: కోటనందూరు మండలం అప్పలరాజుపేటలో విద్యుత్‌షాక్‌తో మామిడి శ్రీను అనే వ్యక్తి మృతి.
  • తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ. శ్రీవారి ఉచిత దర్శనానికి 24 గంటల సమయం. ఈ రోజు శ్రీవారిని దర్శించుకున్న 56,837 మంది భక్తులు. ఈ రోజు శ్రీవారి హుండీ ఆదాయం రూ.2.89 కోట్లు.

మరో ఏడాది.. రాజమౌళి మాట నిలుపుకుంటాడా..!

RRR Release, మరో ఏడాది.. రాజమౌళి మాట నిలుపుకుంటాడా..!

‘బాహుబలి’ వంటి బ్లాక్‌బస్టర్ తరువాత దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తోన్న మరో భారీ బడ్జెట్ చిత్రం ‘ఆర్ఆర్ఆర్’. టాలీవుడ్ టాప్ హీరోలు ఎన్టీఆర్, రామ్‌చరణ్‌లతో రాజమౌళి ఈ సినిమా ప్రకటించిన రోజు నుంచి అందరిలోనూ విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. అందుకే ఈ సినిమాకు సంబంధించిన ప్రతి అప్‌డేట్‌ కోసం అభిమానులు ఆసక్తినిగా ఎదురుచూస్తున్నారు. ఇదంతా పక్కనపెడితే ఇప్పుడు ఈ సినిమా విషయంలో అందరినీ ఓ ప్రశ్న తొలుస్తోంది అదేంటంటే..

ఆర్ఆర్ఆర్ గురించి నిర్వహించిన తొలి ప్రెస్‌మీట్‌లో ఈ సినిమా విడుదల తేదిని ప్రకటించాడు నిర్మాత దానయ్య. 2020,జూలై 30న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుందని ఆయన అధికారికంగా ప్రకటించాడు. ఇప్పుడు ఈ సమయానికి మరో ఏడాది సమయం ఉంది. అంటే ఈ లోపు షూటింగ్‌, గ్రాఫిక్స్ పోస్ట్ ప్రొడక్షన్ అన్ని పనులు కంప్లీట్ అవ్వాలి. అయితే ఏ సినిమా విషయంలోనైనా పర్‌ఫెక్షన్ చూసే రాజమౌళి మేకింగ్‌కే కొన్ని నెలల సమయం తీసుకుంటాడు. ఇలాంటి సమయంలో ఆర్ఆర్ఆర్ అనుకున్న సమయానికి వస్తుందా..? అని కొందరు అభిప్రాయపడుతున్నారు.

RRR Release, మరో ఏడాది.. రాజమౌళి మాట నిలుపుకుంటాడా..!

 

ఇదిలా ఉంటే సెట్స్‌పైకి వెళ్లిన తరువాత మొదటి షెడ్యూల్‌ను విజయవంతంగా పూర్తి చేసుకుంది ఆర్ఆర్ఆర్. ఇక రెండో షెడ్యూల్‌ సమయంలో చెర్రీ కాలికి గాయం అవ్వడం, ఆ తరువాత ఎన్టీఆర్‌ గాయపడటంతో షూటింగ్‌కు కాస్త బ్రేక్ ఇచ్చి.. ఇటీవలే తిరిగి ప్రారంభించారు. మరోవైపు ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన నటించాల్సిన హాలీవుడ్ నటి ఎడ్గర్ జోన్స్ తప్పుకోగా.. ఆ స్థానంలో మరో భామను ఇంకా రీప్లేస్ చేయలేదు. ఇక ఈ సినిమా షూటింగ్‌లో జరుగుతున్న జాప్యం చూసి సినిమా కచ్చితంగా వాయిదా పడుతుందని అంచనా వేస్తున్నారు.

కాగా నిర్మాత దానయ్య మాత్రం.. డేట్ మారే ప్రసక్తి లేదని అంటున్నాడు. అన్నీ అనుకున్నట్లే జరుగుతాయని.. చిన్న చిన్న మార్పులు తప్ప షెడ్యూల్స్ అన్నీ పక్కాగా వెళ్తున్నాయని ఆయన ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ సినిమా విషయంలో రాజమౌళి ఏ మాత్రం మాటను నిలుపుకుంటాడో చూడాలి.

Related Tags