Breaking News
  • వరంగల్‌ రూరల్‌ జిల్లాలో విషాదం. పొలాలకు పెట్టిన విద్యుత్‌ తీగలు తగిలి ఇద్దరు మృతి. నల్లబెల్లి మండలం కొండాపురంలో ఘటన. మృతులు సుధాకర్‌, కొమ్మయ్యగా గుర్తింపు.
  • తమిళనాడుకు వరద ముప్పు. ఈరోడ్‌, సేలం జిల్లాల్లో భారీ వర్షాలు. కర్నాటక కావేరి ఎగువప్రాంతంలోనూ భారీ వర్షాలు. సేలం జిల్లాలోని నది పరీవాహక ప్రాంతాల్లో భారీగా చేరిన వరద. భవానీసాగర్‌ నిండడంతో కోడివేరి డ్యామ్‌ నుంచి నీరు విడుదల. పొంగిపొర్లుతున్న వైగైనది.
  • విజయవాడ: చిన్నారి ద్వారక హత్య కేసు. కాసేపట్లో ద్వారక మృతదేహానికి పోస్టుమార్టం. ఈ నెల 10న నల్లగుంటలో అదృశ్యమై హత్యకు గురైన ద్వారక. మృతురాలి తల్లిని అర్ధరాత్రి వరకు విచారించిన పోలీసులు. నిందితుడు ప్రకాష్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు. నిందితుడు ప్రకాష్‌ గురించి వెలుగులోకి వస్తున్న అనేక విషయాలు.
  • మధ్యప్రదేశ్‌లో అసదుద్దీన్‌ ఒవైసీపై కేసు నమోదు. సుప్రీంకోర్టు తీర్పుపై అసదుద్దీన్‌ తీవ్ర వ్యాఖ్యలు. అసద్‌ వ్యాఖ్యలపై జహంగీర్‌బాద్‌ పీఎస్‌లో అడ్వొకేట్‌ పవన్‌ ఫిర్యాదు. కేసు నమోదు చేసిన జహంగీర్‌బాద్‌ పోలీసులు.
  • ఈ నెల 14న ఒంగోలులో సీఎం వైఎస్‌ జగన్‌ పర్యటన. నాడు-నేడు కార్యక్రమాన్ని ప్రారంభించనున్న సీఎం జగన్‌. ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్న మంత్రులు బాలినేని, విశ్వరూప్‌, సురేష్‌.
  • విశాఖ: నకిలీ ష్యూరిటీ పత్రాల బెయిల్‌ కేసు. ఇద్దరు ప్రధాన నిందితులను కస్టడీలోకి తీసుకున్న పోలీసులు. ఏ1 కోటేశ్వరరావు, ఏ2 సూర్యనారాయణను.. మూడు రోజులపాటు విచారించిన పోలీసులు. పోలీసు విచారణలో కీలక విషయాలు వెల్లడించిన నిందితులు. ఇప్పటివరకు 216 కేసుల్లో ఫోర్జరీ పత్రాలను.. బెయిల్‌కు సమర్పించినట్టు ఒప్పుకున్న నిందితులు.
  • ప.గో: భక్తులతో కిటకిటలాడుతున్న ద్వారకా తిరుమల శివాలయం. రాత్రి 7గంటలకు జ్వాలాతోరణ మహోత్సవం, అనంతరం ఊరేగింపు

బిగ్ బాస్: ఎలిమినేషన్‌లో ‘ఆ నలుగురు’.. డేంజర్ జోన్‌లో ‘ఆమె’!

అక్కినేని నాగార్జున హోస్టుగా వ్యవహరిస్తున్న బిగ్ బాస్ సీజన్ 3 చివరి అంకంకు చేరుకుంది. మరో నాలుగు వారాల్లో షో ముగియనుంది. హౌస్‌లో అందరూ కూడా స్ట్రాంగ్ కంటెస్టెంట్లే ఉండటంతో రోజుకో ట్విస్ట్‌తో ప్రేక్షకుల్లో ఆసక్తిని కలిగిస్తున్నాడు బిగ్ బాస్. ఇకపోతే ఈ వారం బిగ్ బాస్ ఇచ్చిన ‘రాళ్లే రత్నాలు’ టాస్క్‌లో రాహుల్ సిప్లిగంజ్, పునర్నవి, వరుణ్ సందేశ్, మహేష్ విట్టా‌లు ఓడిపోవడంతో వారు ఎలిమినేషన్‌కు నామినేట్ అయ్యారు. అనూహ్యంగా ఈ వారం ఎలిమినేషన్స్‌లోకి ప్రేమ జంట రావడంతో ఎవరు హౌస్ నుంచి బయటికి వెళ్తారనే దానిపై ఆసక్తి నెలకొంది.

వరుణ్ సందేశ్ హౌస్‌లో ఉన్న స్ట్రాంగ్ కంటెస్టెంట్లలో ఒకరు. మొదట్లో గొడవలు పడినా.. ఆ తర్వాత నెమ్మదించి మిస్టర్ పర్ఫెక్ట్‌గా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్‌ను సంపాదించుకున్నాడు. కాబట్టి వరుణ్‌ ఎలాగో సేఫ్ అయినట్లే. అటు మహేష్ విట్టా కూడా చక్కగా ఆడుతూ.. గొడవలకు దూరంగానే ఉంటున్నాడు. ఇక రాహుల్ సిప్లిగంజ్ ఒకసారి ఎలిమినేట్ అయ్యి.. అది కాస్తా ఫేక్ ఎలిమినేషన్ అంటూ మళ్ళీ హౌస్‌లోకి రీ-ఎంట్రీ ఇచ్చాడు. దీనితో వీళ్ళు ముగ్గురు డేంజర్ జోన్ నుంచి తప్పించుకున్నారని చెప్పొచ్చు.

ఇక చివరిగా మిగిలిన పునర్నవి.. రాహుల్‌తో లవ్ గేమ్ తప్పితే.. సరిగ్గా ఏ టాస్క్‌లోనూ చురుకుగా పాల్గొలేదు. అంతేకాక కిందటి వారం రవికృష్ణను అనవసరంగా తిట్టిందని సోషల్ మీడియాలో టాక్ ఉంది. ఇక రవి కూడా బయటికి వచ్చి.. తన బాధను చెప్పుకున్నాడు. దీనితో పునర్నవి ఈ వారం హౌస్ నుంచి ఎగ్జిట్ కానుందని నెట్టింట్లో ఓ వార్త హల్చల్ చేస్తోంది.

మరోవైపు ప్రస్తుతం ఓటింగ్‌లో ఈమె చివరి స్థానంలో ఉంది. అయితే వీకెండ్ వచ్చేలోపు ఏదైనా జరగొచ్చు.. ఊహించని విధంగా డబుల్ ఎలిమినేషన్ కూడా ఉండొచ్చు. ఒకవేళ డబుల్ ఎలిమినేషన్ ఉన్నా.. లవ్ బర్డ్స్ కానీ.. మహేష్ విట్టాతో పాటు పునర్నవి బయటికి వెళ్లే అవకాశాలు ఉన్నాయని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. చూడాలి మరి అసలు ఏం జరుగుతుందో.