వాళ్లను చంపడానికి జవాన్లు ఈసీ అనుమతి తీసుకోవాలా..?

విపక్షాలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు ప్రధాని మోదీ. ఉగ్రవాదులపై కాల్పులు జరపాలంటే.. ఈసీ అనుమతి తీసుకోవాలా అంటూ పరోక్షంగా విపక్షాలను ప్రశ్నించారు. దేశంలో ఓ వైపు ఎన్నికలు జరుగుతుంటే ఉగ్రవాదులపై సైనికులు కాల్పులు జరుపుతున్నారన్న విపక్షాలపై మోదీ విస్మయం వ్యక్తం చేశారు. యూపీలో ఆదివారం జరిగిన ఎన్నికల ప్రచారంలో మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రజలు సమర్థ ప్రభుత్వానికే పట్టం కడుతారని.. విపక్షాలకు ఓటమి తప్పదన్నారు. కాగా, ఆదివారం ఉదయం షోఫియన్ జిల్లాలోని హింద్‌ సితాపూర్ ప్రాంతంలో […]

వాళ్లను చంపడానికి జవాన్లు ఈసీ అనుమతి తీసుకోవాలా..?
Follow us

| Edited By:

Updated on: May 13, 2019 | 11:28 AM

విపక్షాలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు ప్రధాని మోదీ. ఉగ్రవాదులపై కాల్పులు జరపాలంటే.. ఈసీ అనుమతి తీసుకోవాలా అంటూ పరోక్షంగా విపక్షాలను ప్రశ్నించారు. దేశంలో ఓ వైపు ఎన్నికలు జరుగుతుంటే ఉగ్రవాదులపై సైనికులు కాల్పులు జరుపుతున్నారన్న విపక్షాలపై మోదీ విస్మయం వ్యక్తం చేశారు. యూపీలో ఆదివారం జరిగిన ఎన్నికల ప్రచారంలో మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రజలు సమర్థ ప్రభుత్వానికే పట్టం కడుతారని.. విపక్షాలకు ఓటమి తప్పదన్నారు.

కాగా, ఆదివారం ఉదయం షోఫియన్ జిల్లాలోని హింద్‌ సితాపూర్ ప్రాంతంలో సైన్యం కార్డెన్ సెర్చ్ నిర్వహించింది. ఈ క్రమంలో ఉగ్రవాదులు కాల్పులకు తెగబడగా.. భద్రతా బలగాలు తిప్పికొట్టాయి. ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు ఉగ్రవాదులను మట్టుబెట్టారు. సంఘటనా స్థలం నుంచి పలు ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. ఇదిలా ఉంటే, సైన్యం విషయాలను రాజకీయం చేయడంపై పెద్ద ఎత్తున అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ప్రధాని మోదీ పదేపదే తన రాజకీయ ప్రసంగాల్లో సైన్యం ప్రస్తావన తీసుకువస్తున్నారని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి.