నా రూటే వేరు.. నా మాటే శాసనం..!

నా రూటే వేరు.. నేను చెప్పిందే శాసనం.. కేంద్రం చెప్పిన మాట మేమేందుకు వినాలి..? నా రాష్ట్రం నా ఇష్టం.. అంటున్నారు పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ. లాక్‌డౌన్‌ ఆంక్షలు, జోన్ల విషయంలో కేంద్రం, పశ్చిమబెంగాల్‌ మధ్య జరుగుతున్న డైలాగ్‌ వార్‌.. తాజాగా మరింత ముదిరింది. 4.0 లాక్‌డౌన్‌ సందర్భంగా ఇప్పటికే కొన్ని సడలింపులిచ్చిన కేంద్రం.. రాత్రి 7 గంటల నుంచి ఉదయం 7 వరకు కర్ఫ్యూ ఖచ్చితంగా అమలుచేయాలని ప్రకటించింది. కేంద్రం రిలిజ్‌ చేసిన […]

నా రూటే వేరు.. నా మాటే శాసనం..!
Follow us

| Edited By:

Updated on: May 19, 2020 | 12:14 PM

నా రూటే వేరు.. నేను చెప్పిందే శాసనం.. కేంద్రం చెప్పిన మాట మేమేందుకు వినాలి..? నా రాష్ట్రం నా ఇష్టం.. అంటున్నారు పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ. లాక్‌డౌన్‌ ఆంక్షలు, జోన్ల విషయంలో కేంద్రం, పశ్చిమబెంగాల్‌ మధ్య జరుగుతున్న డైలాగ్‌ వార్‌.. తాజాగా మరింత ముదిరింది.

4.0 లాక్‌డౌన్‌ సందర్భంగా ఇప్పటికే కొన్ని సడలింపులిచ్చిన కేంద్రం.. రాత్రి 7 గంటల నుంచి ఉదయం 7 వరకు కర్ఫ్యూ ఖచ్చితంగా అమలుచేయాలని ప్రకటించింది. కేంద్రం రిలిజ్‌ చేసిన గైడ్‌లైన్స్‌ అమలయ్యేలా చూడాలని.. రాష్ట్రాలు విచ్ఛిన్నం కాకూడదని కేంద్ర హోంశాఖ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.

అయితే కేంద్రం ఆదేశాలకు భిన్నంగా..పశ్చిమబెంగాల్‌లో మాత్రం నైట్‌ కర్ఫ్యూ ఉండదని సంచలన ప్రకటన చేశారు సీఎం మమత. రాత్రి కర్ఫ్యూ లేదని ముఖ్యమంత్రే చెప్పడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. మరోవైపు 4.0 లాక్ డౌన్ లో భాగంగా తమదైనరీతిలో ఆంక్షలు సడలించింది. కంటైన్మెంట్‌ ప్రాంతాల్లో తప్ప అన్ని ఏరియాల్లో స్టోర్స్‌, మాల్స్ అన్నీ ఓపెన్‌ చేసుకోవచ్చని గ్రీన్‌ సిగ్నలిచ్చేశారు మమత. బస్సులు, ఆటోలకు కూడా పర్మిషనిచ్చేశారు. దీంతో జనం రోడ్ల మీద బీభత్సంగా తిరిగేస్తున్నారు. పోలీసులు సైతం కంట్రోల్‌ చేసే పరిస్థితి లేదు.