మీ గౌరవం మీరే సంపాదించుకోవాలి.. కంగనా మరో ట్వీట్

బాలీవుడ్ క్వీన్ కంగనా మరోసారి తన మాటల తూటాలను సందించారు. బాలీవుడ్ నటి కంగనాకు, మహారాష్ట్ర సర్కార్‌కు మధ్య వివాదం అగ్గి రాజేస్తోంది. బుధవారం నాడు కంగనా ముంబైకి చేరుకునే లోపే బీఎంసీ అధికారులు కంగనా కార్యాలయాన్ని

మీ గౌరవం మీరే సంపాదించుకోవాలి.. కంగనా మరో ట్వీట్
Follow us

|

Updated on: Sep 10, 2020 | 12:17 PM

బాలీవుడ్ క్వీన్ కంగనా మరోసారి తన మాటల తూటాలను సందించారు. బాలీవుడ్ నటి కంగనాకు, మహారాష్ట్ర సర్కార్‌కు మధ్య వివాదం అగ్గి రాజేస్తోంది. బుధవారం నాడు కంగనా ముంబైకి చేరుకునే లోపే బీఎంసీ అధికారులు కంగనా కార్యాలయాన్ని కూల్చివేయడంతో అగ్గి మీద గుగ్గిలం అయ్యారు. శివసేనపై, ఉద్ధవ్‌పై వరుస ట్వీట్లతో విరుచుకుపడుతున్నారు.

తాజాగా ఉద్ధవ్‌ను ఉద్దేశించి కంగనా పరోక్షంగా మరోసారి ట్వీట్ చేశారు. ‘మీ తండ్రి చేసిన మంచి పనులు మీకు సంపదనిచ్చాయి.. కానీ మీ గౌరవం మీరే సంపాదించుకోవాలి.. మీరు నా నోరు మూయించగలరు, కానీ నా గొంతు వంద మిలియన్లతో ప్రతిధ్వనిస్తుంది. ఎంత మంది నోర్లు మీరు మూయించగలరు? ఎన్ని గొంతులను మీరు నొక్కిపెట్టగలరు? మీరు ఎప్పుడైతే నిజం నుంచి తప్పించుకోవాలని చూస్తారో.. మీరు రాజవంశానికి నమూనాగా మిగిలిపోతారు తప్ప ఇంకేమీ కారు’ అని మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రేను ఉద్దేశించి కంగనా ట్వీట్ చేశారు.

బాలీవుడ్‌ నటుడు సుశాంత్‌ ఆత్మహత్య కేసును సీబీఐ(CBI)దర్యాప్తు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ కేసును విచారించిన ముంబై పోలీసులపై నమ్మకం లేదని, ఆ నగరం పీవోకే(POK)లా మారిందన్న కంగనా చేసిన వ్యాఖ్యలు శివసేనకు కోపం తెప్పించాయి. కంగనా కామెంట్స్ పై శివసేన ఎంపీ సంజయ్‌ రౌత్‌ విరుచుకుపడ్డారు. ముంబైలో భద్రత లేదనుకుంటే తిరిగి రావద్దని కంగనాకు వార్నింగ్ ఇచ్చారు. దీంతో కేంద్రం ఆమెకు సీఆర్పీఎఫ్‌ బలగాలతో ‘వై’ కేటగిరీ భద్రత కల్పించింది.

ఎన్సీపీకి చెందిన రాష్ట్ర హోంమంత్రి అనిల్‌ దేశ్‌ముఖ్‌ ఆమెపై విరుచుకుపడ్డారు. ‘బతుకుదెరువుకు ముంబై వచ్చిన అమ్మాయి ఇక్కడి పోలీసులను అవమానించడం విచారకరం. మహారాష్ట్రను అవమానిస్తే ప్రజలు సహించరు’ అన్నారు. కంగనా మాదక ద్రవ్యాలు వాడుతోందని, ఆమెపై దర్యాప్తు జరపాలని శివసేన ఎమ్మెల్యేలు కొందరు డిమాండ్‌ చేశారు. దీంతో బుధవారం తాను వస్తున్నానని, ఎవరు అడ్డుకుంటారో చూస్తానని కంగన ట్విటర్‌లో సవాల్‌ విసిరారు. చెప్పినట్టుగానే కంగనా బుధవారం ముంబై వచ్చారు. అయితే.. ఈలోపే కంగనా ఇంట్లోని ఆఫీసు నిర్మాణం అక్రమమంటూ బృహణ్‌ ముంబై కార్పొరేషన్‌ కూల్చివేసింది. ఈ కార్పొరేషన్‌ శివసేన పాలనలోనే ఉంది.