Breaking News
  • తెలుగు రాష్ట్రాలకు రూ.10లక్షలు విరాళం. మలికిపురం మండలం మట్టపర్రు సొంత గ్రామానికి తనవంతు సహాయంగా 5లక్షలు అందజేత.. తన కుటుంబ సభ్యుల ద్వారా తన గ్రామంలో రేషన్ కార్డులు ఉన్న ప్రతి ఒక్కరికీ వెయ్యి రూపాయల చొప్పున పంపిణీ.. కరోనా వైరస్ బారిన పడకుండా జాగ్రత్తగా ఉండాలని పిలుపు..
  • న్యూఢిల్లీ: కరోనా వైరస్ పై జరుగుతున్న యుద్ధంలో విజయం సాధించాలంటే ప్రజల సహకారం మరింత అవసరమని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి.
  • కాశ్మీర్ లోయలో ఒక్కరోజులోనే 7 కొత్త కరోనా కేసుల నమోదు. శ్రీనగర్‌లో విదేశాలకు వెళ్లొచ్చిన ముగ్గురికి, మతపరమైన ప్రార్థనలకు హాజరైన నలుగురికి కరోనా పాజిటివ్. పాజిటివ్ కేసుల కాంటాక్ట్ ట్రేసింగ్ మొదలు పెట్టిన అధికారులు.
  • విజయనగరం : టివి9 సమచారంతో స్పందించిన విశాఖ రీజియన్ డిఐజి కాళిదాసు రంగారావు ఏపి చెన్నై బోర్డర్ అధికారులతో పాటు చైన్నై కి చెందిన పోలీస్ ఉన్నతాధికారులతో మాట్లాడిన డిఐజి విజయనగరం జిల్లాకు చెందిన వారికి మౌలిక సదుపాయాలు కల్పించాలని విన్నపం బాధితులతో మాట్లాడిన రంగారావు.
  • సూర్యాపేట: మోతె మండలం రాఘవ పురం,నామవరం గ్రామాల్లో దళిత కాలనిలో ఇంటి ఇంటికి తిరిగి కూరగాయలు పంపిణీ చేసిన ఎంపీపీ మీ ఆశా శ్రీకాంత్ రెడ్డి. పంచిన ఎంపీపీ ఆశశ్రీకాంత్ రెడ్డి, పాల్గొన్న సర్పంచ్ లు,ఆశా వర్కర్లు, పోలీస్ సిబ్బంది.
  • కరోనా మహమ్మారి ప్రభావం వివిధ రంగాలపై తీవ్రంగా పడింది. దీని బారి నుంచి ప్రజలను కాపాడటానికి ఇప్పటికే హీరోల నుంచి సినీ నిర్మాతల నుంచి , దర్శకుల నుంచి విరాళాలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే. ఈ సంక్షోభం నుంచి సినిమా రంగాన్ని బయటపడేయటానికి సినీ ప్రముఖులు కంకణం కట్టుకున్నారు.
  • తెలంగాణలో లాక్‌డౌన్‌ ఉన్నా కొంతమంది ఖాతరు చేయడం లేదు. అడ్డదారుల్లో రాష్ట్ర సరిహద్దులు దాటేందుకు ప్రయత్నిస్తున్నారు. కంటైనర్‌లో వందల మంది ఇతర రాష్ట్రాలకు వెళ్లే ప్రయత్నం చేయగా.. పోలీసులు అడ్డుకున్నారు.
  • కరోనా పిశాచి అంతకంతకూ కోరలు చాస్తూ విలయతాండవం చేస్తోంది.. అగ్రరాజ్యం అమెరికా సైతం కరోనా మహమ్మారికి అడ్డుకట్ట వేయలేకపోతోంది. అక్కడ ఒక్కరోజే 18 వేల కొత్త కేసులు నమోదయ్యాయి.

మరో నలుగురు పోతే బాబు హోదా గల్లంతే!

threat to chandrababu status, మరో నలుగురు పోతే బాబు హోదా గల్లంతే!

చంద్రబాబు హోదాకు ముప్పు వాటిల్లబోతోందా? అందుకు రంగం సిద్దమైపోయిందా? కొత్త సంవత్సరం తొలి రోజుల్లోనే చంద్రబాబుకు హోదా చేజారనుందా? ఈ ప్రశ్నలన్నింటికీ అవుననే ఆబ్జర్వేషనే వినిపిస్తోంది.

మొన్నటి ఎన్నికల్లో టీడీపీ తరపున గెలిచిన 23 మంది ఎమ్మెల్యేల్లో ఇదివరకే ఒకరు చేజారారు. గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ వైసీపీ అధినేత, ముఖ్యమంత్రి జగన్‌తో భేటీ అయి, వైసీపీకి అనుకూలంగా మారిపోయారు. టెక్నికల్‌గా సమస్యలుండడం, రాజీనామా చేసేందుకు వెనుకాడడం వల్ల వంశీ అసెంబ్లీలో ప్రత్యేక సభ్యునిగా మారిపోయారు. తాజాగా ఏపీ క్యాపిటల్ ఇష్యూ రాష్ట్రాన్ని షేక్ చేస్తున్న తరుణంలో గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యే మద్దాలి గిరిధర్ రావు కూడా సేమ్ టు సేమ్ వంశీ తరహాలోనే నేరుగా వెళ్ళి ముఖ్యమంత్రిని కలిశారు. ఆ తర్వాత సాంకేతికంగా పార్టీ మారడం సాధ్యం కాకపోవడంతో తనను ప్రత్యేక సభ్యునిగా గుర్తించాలని స్పీకర్ తమ్మినేని సీతారామ్‌ను కోరనున్నట్లు ప్రకటించారు. సో.. టీడీపీ సంఖ్య 21కి తగ్గిపోయింది.

ఏపీ అసెంబ్లీలో మొత్తం సభ్యుల సంఖ్య 175. అంటే కనీసం 18 మంది ఎమ్మెల్యేలుంటేనే చంద్రబాబుకు ప్రధాన ప్రతిపక్ష హోదా దక్కుతుంది. కేబినెట్ ర్యాంకుతో ప్రభుత్వం సౌకర్యాలు కల్పిస్తుంది. అంటే ఇంకో నలుగురు టీడీపీ ఎమ్మెల్యేలు వంశీ, గిరిల బాటను ఎంచుకుంటే బాబుకు ‘ప్రత్యేక’ హోదా గల్లంతే అన్నమాట. విశాఖను ఎగ్జిక్యూటివ్ రాజధానిగా వ్యతిరేకించిన టీడీపీ అధిష్టానంతో దాదాపు విభేదించినంత పనిచేశారు విశాఖ నగరానికి చెందిన వాసుపల్లి గణేశ్, వెలగపూడి రామకృష్ణ. మరోవైపు గంటా శ్రీనివాస్ రావు కూడా మాటలకు చేతలకు పొంతన లేకుండా వ్యవహరిస్తున్నారు. పార్టీని వీడనంటూనే అంటీముట్టనట్లుంటున్నారు గంటా.

ప్రకాశం జిల్లా అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్‌పైన పలువురు అనుమానంగానే వున్నారు. ఆయన కూడా ఏ క్షణమైనా పార్టీ మారేందుకు రెడీగా వున్నారని ప్రచారం జరుగుతోంది. పార్టీలో కరణం బలరామ్‌తో ఆయనకున్న చిరకాల వైరం ఆసరాగా జిల్లా మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి ఈ విషయంలో చొరవ చూపుతూ రవికుమార్‌ని వైసీపీకి అనుకూలంగా మారేందుకు యత్నిస్తున్నారని తెలుస్తోంది.

గంటా, గొట్టిపాటి, వెలగపూడి, వాసుపల్లి.. వీరు గనక టీడీపీకి గుడ్‌బై కొడితే.. ఆ మరుక్షణం చంద్రబాబుకున్న ‘ప్రత్యేక‘ హోదా అదే.. ప్రతిపక్ష నేత హోదా చేజారడం ఖాయంగా కనిపిస్తోంది. ఇది జరగడానికి ఎన్నో రోజులు లేదని వైసీపీ వర్గాలు చెప్పుకుంటున్నాయి. అన్నీ కుదిరితే.. సంక్రాంతి నాటికే పరిస్థితిలో మార్పు వస్తుందని చెప్పుకుంటున్నాయి అధికార పార్టీ వర్గాలు.

Related Tags