రాజ్యసభలో.. కమలానికి కఠిన పరీక్ష!

పౌరసత్వ సవరణ బిల్లు లోక్ సభలో గట్టెక్కింది. మరి రాజ్యసభ సంగతేంటి? పెద్దలసభలోనూ సవరణపై సమరం తప్పదా? పరిస్థితి చూస్తోంటే అదే జరిగేలా ఉంది. ఈ బిల్లును రాజ్యసభలో గట్టెక్కించడం కమలానికి కఠిన పరీక్షగా మారింది. దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన పౌరసత్వ సవరణ బిల్లును మొదటి మెట్టు ఎక్కించడంలో మోదీ సర్కార్ సఫలమైంది. ఇప్పుడు రాజ్యసభలోను బిల్లు పాస్ చేయించేందుకు వ్యూహాలు రచిస్తోంది. కేవలం ముస్లిమేతర మతాలకు చెందిన వారికి మాత్రమే భారత పౌరసత్వం వచ్చేలా బిల్లును […]

రాజ్యసభలో.. కమలానికి కఠిన పరీక్ష!
Follow us

| Edited By:

Updated on: Dec 11, 2019 | 5:44 AM

పౌరసత్వ సవరణ బిల్లు లోక్ సభలో గట్టెక్కింది. మరి రాజ్యసభ సంగతేంటి? పెద్దలసభలోనూ సవరణపై సమరం తప్పదా? పరిస్థితి చూస్తోంటే అదే జరిగేలా ఉంది. ఈ బిల్లును రాజ్యసభలో గట్టెక్కించడం కమలానికి కఠిన పరీక్షగా మారింది. దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన పౌరసత్వ సవరణ బిల్లును మొదటి మెట్టు ఎక్కించడంలో మోదీ సర్కార్ సఫలమైంది. ఇప్పుడు రాజ్యసభలోను బిల్లు పాస్ చేయించేందుకు వ్యూహాలు రచిస్తోంది. కేవలం ముస్లిమేతర మతాలకు చెందిన వారికి మాత్రమే భారత పౌరసత్వం వచ్చేలా బిల్లును సవరించడంపై.. పెద్ద ఎత్తున ప్రభుత్వంపై విమర్శలు వస్తున్నాయి. ఈశాన్య రాష్ట్రాలు అగ్నిగుండంలా మారుతున్నాయి. అయినా మోదీ సర్కార్ వెనకడుగు వేయడంలేదు. ఏదేమైనా బిల్లును పాస్ చేయించేందుకు సిద్ధమౌతోంది. రాజ్యసభలో బిల్లు ఆమోదం పొందాలంటే 245 మంది సభ్యులున్న సభలో 123 మంది ఎంపీల మద్దతు అవసరం. ప్రస్తుతం 240 మంది సభ్యులు ఉన్నారు. అంటే కావాల్సిన మెజారిటీ 121. కానీ బిజెపికి సొంతంగా 83 మంది సభ్యుల బలం మాత్రమే ఉంది. అయితే అన్నాడీఎంకే, బిజెడి, శివసేన, వైసిపి, టిడిపి మద్దతుతో బిల్లు గట్టెక్కాలని బిజెపి యత్నిస్తోంది. ఈ బిల్లుని మోదీ ప్రభుత్వం రాజ్యసభలో కూడా సునాయాసంగా నెగ్గేట్టు కనిపిస్తోంది.