Breaking News
  • అమరావతి: చంద్రబాబును నమ్మి భూములిచ్చి దళిత రైతులు మోసపోయారు. మా ప్రభుత్వ నిర్ణయంతో దళిత రైతులకు న్యాయంజరిగింది-ఎమ్మెల్యే ఆర్కే. దళిత రైతుల భూములను చంద్రబాబు తనవారికి కారుచౌకగా ఇప్పించారు. రాజధాని ప్రాంతంలో బినామీలుగా ఉన్న మంత్రులు, ఎమ్మెల్యేల చిట్టాను త్వరలో బయటపెడతాం-ఎమ్మెల్యే ఆర్కే.
  • ప్రకాశం జిల్లా: సింగరాయకొండ మండలం పాకల దగ్గర సముద్రంలో నలుగురు యువకుల గల్లంతు. ముగ్గురిని కాపాడిన మెరైన్‌ పోలీసులు. మరో యువకుడి కోసం కొనసాగుతున్న గాలింపు.
  • యానాంలో ప్రేమజంట అనుమానాస్పద మృతి. మృతులు కాట్రేనిపాడుకు చెందిన రమేష్‌. మలికిపురం మండలానికి చెందిన యువతిగా గుర్తింపు. పెద్దలు పెళ్లికి అంగీకరించలేదని ఈ నెల 9న ఇంటి నుంచి వెళ్లిపోయిన ప్రేమజంట. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు.
  • శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌లో భారీగా బంగారం పట్టివేత. దుబాయ్‌ నుంచి వచ్చిన ప్రయాణికుడి నుంచి 14 కిలోల బంగారం స్వాధీనం. అదుపులోకి తీసుకుని విచారిస్తున్న కస్టమ్స్ అధికారులు. పట్టుబడ్డ బంగారం విలువ రూ.5.46 కోట్లు ఉంటుందని అంచనా.
  • అమరావతి: అసెంబ్లీకి వెళ్లకుండా మమ్మల్ని అడ్డుకున్నారు-చంద్రబాబు. అమాయకులపై ఎస్సీ, ఎస్టీ యాక్ట్‌ పెట్టి దాడులు చేస్తున్నారు. టీడీపీ హయాంలో ఇంగ్లీష్‌ మీడియాన్ని వైసీపీ నేతలు వ్యతిరేకించారు ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం తెచ్చి రెండు నాలుకలధోరణి అవలంబిస్తున్నారు కొత్త చీఫ్‌ మార్షల్‌ దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నారు-చంద్రబాబు.
  • గుంటూరు: ఎన్నికల్లో ఇచ్చిన హామీలను వైసీపీ నెరవేర్చలేదు. ఆర్టీసీ చార్జీలు పెంచి సామాన్యుడి నడ్డి విరిచారు-యరపతినేని. ఉల్లి ధరలు ఆకాశాన్ని అంటాయి-మాజీ ఎమ్మెల్యే యరపతినేని. నియోజకవర్గ పరిధిలో ఇసుక మాఫియా రెచ్చిపోతోంది. వైసీపీ కార్యకర్తలే ఇసుకను బ్లాక్‌ మార్కెట్‌లో అమ్ముతున్నారు-మాజీ ఎమ్మెల్యే యరపతినేని.

75% స్థానికతపై ట్వీట్‌ వార్!

jobs-for-locals, 75% స్థానికతపై ట్వీట్‌ వార్!

ఏపీలోని పరిశ్రమల్లో 75 శాతం ఉద్యోగాలు స్థానికులకే ఇవ్వాలంటూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై నీతి ఆయోగ్‌ సీఈవో అమితాబ్‌కాంత్‌ చేసిన ట్వీట్‌ చర్చనీయాంశమవుతోంది. ఏపీ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల నుంచి ఏపీకి వచ్చేవారికి ఉద్యోగాలు తగ్గిపోతాయంటూ ‘ఫైనాన్షియల్‌ టైమ్స్‌’ పత్రిక కథనాన్ని వెలువరించింది. దీనివల్ల సమాఖ్య వ్యవస్థకు విఘాతం కలుగుతుందని ఆ కథనంలో అభిప్రాయపడింది. రాజ్యాంగం దేశంలోని పౌరులందరూ ఎక్కడైనా స్వేచ్ఛగా నివసించేందుకు, పనిచేసుకునేందుకు వీలు కల్పించిందని.. ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ చట్టం వల్ల పెట్టుబడులు, ఉత్పత్తిపై పెను ప్రభావం పడుతుందని ఆ కథనంలో పేర్కొంది. ఈ కథనాన్ని జత చేసి నీతి ఆయోగ్‌ సీఈవో అమితాబ్‌ కాంత్‌ ట్విటర్‌లో పోస్ట్‌ చేశారు.

దీనిపై ఏపీ సీఎంవో ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పీవీ రమేశ్‌ స్పందించారు. ‘‘మీ కామెంట్లు.. ఆ కథనం పూర్తిగా అసమగ్ర సమాచారంతో కూడినవి’’ అంటూ అభ్యంతరం వ్యక్తం చేస్తూ రీట్వీట్‌ చేశారు. స్థానికేతరులకు అవకాశాలు తగ్గించడం ద్వారా ఏపీలోని స్థానికులకు తగినన్ని ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడం ఈ చట్టం ముఖ్య ఉద్దేశమని ఆయన వివరించారు. దీనిలో సమాఖ్య విధానాన్ని దెబ్బతీసే ఉద్దేశమేదీ లేదని పేర్కొన్నారు. దీనిపై అమితాబ్‌ కాంత్‌ స్పందిస్తూ ఇవి తన వ్యాఖ్యలు కావని.. ఆ పత్రిక కథనాన్ని మాత్రమే తాను పోస్ట్‌ చేసినట్లు రీట్వీట్‌ చేశారు.