చలాన్లు, శిక్షలు పెంచితే యాక్సిడెంట్లు తగ్గుతాయా ?

Will accidents rate go down with increase in challans and punishments?, చలాన్లు, శిక్షలు పెంచితే యాక్సిడెంట్లు తగ్గుతాయా ?

రోడ్డు ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించే వాహనదారులకు విధించే చలాన్లు, జైలు శిక్షలపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. భారత ప్రభుత్వం నిర్దేశిస్తున్న వీటికి అనుకూలంగా, ప్రతికూలంగా కూడా చాలామంది చాలారకాలుగా మాట్లాడుతున్నారు. భారీ జరిమానాలు, శిక్షలు రోడ్డు ప్రమాదాలను నివారించగలుగుతాయా అన్నది చర్చనీయాంశమే. నిజానికి యాక్సిడెంట్లలో ప్రతి వ్యక్తి మరణాన్నీ నివారించవచ్చు. పైగా ఇది సమాజంపై సామాజిక, ఆర్ధిక ప్రభావం కూడా చూపుతుంది. రోడ్డు ప్రమాదాల నివారణకు తక్షణమే చర్యలు తీసుకోవలసి న అవసరం ఎంతైనా ఉంది. ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర గాయాలకు గురైన వారిలో దాదాపు 50 లక్షల మంది మృతి చెందుతున్నారని అంచనా.. ఇండియాలో ఈ సంఖ్య 10 లక్షలవరకు ఉందట. నిజానికి ఈ మరణాల్లో ప్రతిదాన్నీ నివారించవచ్చు.

ప్రభుత్వం, సమాజం కూడా ఈ అంశానికి ప్రాధాన్యమిస్తోంది. 5.. 29 ఏళ్ళ మధ్య వయసు వారిలో చాలామంది యాక్సిడెంట్లలో గాయపడి మృత్యువాత పడుతున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతోంది. ఈ మరణాలకు చెక్ పెట్టాల్సిన బాధ్యత అందరిమీదా ఉంది. ర్యాష్ డ్రైవింగ్, మందు కొట్టి వాహనాలు నడపడం, ట్రాఫిక్ ఉల్లంఘనలు, డ్రైవింగ్ చేస్తూ మొబైల్ ఫోన్ల వాడకం వంటి అంశాలను ఈ దిశగా పరిశీలించాల్సి ఉంటుంది. అలాగే రోడ్ల నిర్మాణం, క్లియర్ కట్ సిగ్నల్స్, లైటింగ్, డ్రైవింగ్ లైసెన్సుల జారీకి అనుసరించాల్సిన నిర్దిష్ట విధానం లాంటి సాంకేతిక అంశాలను కూడా పరిగణన లోకి తీసుకోవలసి ఉంటుంది. కానీ వీటిని మనం తరచూ విస్మరిస్తున్నాం.

ఇందుకు సంబంధించి వివిధ సంస్థలు చేసే కృషి నేపథ్యంలో వీటినన్నిటిని ఒకే గొడుగు కిందికి తేవలసి ఉంటుంది.
యాక్సిడెంట్ ప్రివెన్షన్ అన్న స్లోగన్ ఆధారంగా ఇంటిగ్రేటెడ్ అప్రోచ్ ను రూపొందించాల్సి ఉంటుంది. ప్రమాదాల నివారణకు ఖర్చు పెట్టే ప్రతి రూపాయీ గాయపడినవారి చికిత్సకు అయ్యే వెయ్యి రూపాయలతో సమానం అంటే అతిశయోక్తి కాదు. క్షతగాత్రుల సంఖ్యను కూడా తగ్గించడం చాలా అవసరం. ఈ విషయంలో ఆటోమొబైల్, ఇంజనీరింగ్, ప్రభుత్వ చట్టాలు కీలక పాత్ర వహిస్తాయి. తగిన ప్రమాణాలు పాటించని ఏ వాహనాన్నీ రోడ్డుపైకి అనుమతించరాదు. టూ వీలర్స్ ప్రయాణించేవారు (వెనుక సీటులో ఉన్నవారితో సహా) హెల్మెట్లు వాడాలి. అలాగే ఫోర్ వీలర్ డ్రైవర్ సీటు బెల్టు వాడడం తప్పనిసరి. ఈ నిబంధనలను ఖఛ్చితంగా పాటించాలి. ఇవి జీవనరీతిలో భాగం కావాలి. చాలామంది ట్రాఫిక్ పోలీసులు పట్టుకుంటారేమోనన్న భయంతో వీటిని వాడుతుంటారు. కానీ నిజానికి ఇవి ప్రాణ రక్షణదాతలు.

అందుకే వీటిపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. ఈ విషయంలో స్వచ్చ్చంద సంస్థలు, ప్రభుత్వ, ప్రయివేటు సంస్థలు, స్కూళ్ళు, కాలేజీలు కూడా ప్రముఖ పాత్ర పోషించాలి.
యాక్సిడెంట్ జరిగినప్పుడు క్వాలిటీ ఎమర్జెన్సీ అవసరం. యాక్సెస్ అన్నదాన్ని ప్రీ-హాస్పిటల్ యాక్సెస్ గా, హాస్పిటల్ యాక్సెస్ గా, ఫైనాన్షియల్ యాక్సెస్ గా దీన్ని విభజించవచ్చు. యాక్సిడెంట్ బాధితులకు వెంటనే చికిత్స లభించాలి. ప్రమాదం జరిగిన స్పాట్ లోనే తక్షణమే ట్రీట్ మెంట్ లభిస్తే.. ఆస్పత్రికి తరలించే లోగా క్షతగాత్రుడి పరిస్థితి మెరుగుపడడానికి అవకాశం ఉంటుంది. ఒకప్పుడు ఇండియాలో ప్రీ-హాస్పిటల్ కేర్ ఉండేది కాదు. కానీ గత పదేళ్లలో ఇన్వెస్టిమెంట్లు పెరగడంతో ఈ పరిస్థితి మారింది. దీన్నే గోల్డెన్ హవర్ అని కూడా అభివర్ణించవచ్ఛు.
ఇక ఎమర్జన్సీ రూముల్లో బాధితులకు త్వరితగతిన డయాగ్నసిస్, చికిత్స చేయాలి.. మంచి శిక్షణ పొందిన డాక్టర్లు, స్టాఫ్ చేత వీటిని ఇప్పించాలి. రోడ్డు ప్రమాదాల నివారణకు ఎంత శ్రధ్ద తీసుకుంటామో.. క్షత గాత్రులకు చికిత్స కూడా అంతే అవసరం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *