Breaking News
  • ఢిల్లీ: భారత్ లో విజృంభిస్తున్న కరోనా వైరస్. ఒక లక్ష 82 వేల మార్క్ ని దాటినా కరోనా పాజిటివ్ కేస్ లు దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు : 182143. దేశ వ్యాప్తంగా యాక్టీవ్ కేసులు: 89995. కరోనా నుంచి డిశ్చార్జ్ అయిన బాధితులు: 86984. దేశం మొత్తం కరోనా తో మృతుల సంఖ్య : 5164. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ.
  • రాష్ట్రంలో లాక్ డౌన్ ను జూన్ 30 వరకు పొడిగించాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. లాక్ డౌన్ కు సంబంధించి కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన తాజా ఆదేశాల నేపథ్యంలో ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు సి.ఎస్ సోమేశ్ కుమార్, డిజిపి మహేందర్ రెడ్డి తదితర ఉన్నతాధికారులతో చర్చించారు. కంటైన్మేంట్ జోన్లు మినహా ఇతర ప్రాంతాల్లో కేంద్ర ప్రభుత్వం సూచించిన సడలింపులను అమలు చేయాలని నిర్ణయించారు. కంటైన్మంట్ జోన్లలో కట్టుదిట్టంగా లాక్ డౌన్ ను అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. రాత్రి పూట కర్ఫ్యూ కూడా రాత్రి 9 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు అమలు చేయాలని ఆదేశించారు.
  • విశాఖ: డాక్టర్ సుధాకర్ కేసు. కేజీహెచ్ లో రెండో రోజు ముగిసిన సీబీఐ విచారణ. కేజీహెచ్ వైద్యాధికారులతో మాట్లాడిన సీబీఐ అధికారి. సీసీ ఫుటేజీని పరిశీలించిన సీబీఐ. 16 న క్యాజువాల్టీలో డాక్టర్ సుధాకర్ కు పరీక్షలు చేసిన కేజీహెచ్ వైద్యులు.
  • ఢిల్లీ లో కరోనా విజృంభన. ఢిల్లీ లో కొత్తగా 1295 కరోనా పాజిటివ్ కేస్ లు ,13 మంది మృతి. ఢిల్లీ రాష్ట్రంలో 19844 కి చేరిన కరోనా కేసులు నమోదు. 473 మంది కరోనా తో మృతి
  • రుతుపవనాలు ఇంకా కేరళ తీరానికి తాకలేదు. దీని పై మేము క్రమం తప్పకుండా మానిటరింగ్ చేస్తున్నాం. జూన్ 1 నుండి పరిస్థితులు అనుకూలంగా ఉంటాయని అనుకుంటున్నాం. ఆగ్నేయ అరేబియా సముద్రం, లక్షద్వీప్ సమీపంలో ఈ రోజు అల్ప పీడనం ఏర్పడింది. జూన్ 2 కి తుఫానుగా మారుతుందని మేము అనుకుంటున్నాం. జూన్ 3 సాయంత్రం నాటికి గుజరాత్ ,ఉత్తర మహారాష్ట్ర తీరం వైపుకు చేరుకుంటుంది. మృత్యుంజయ్ మోహపాత్రా, ఢిల్లీ IMD.
  • జమ్మూ కాశ్మీర్‌లో సీనియర్ ఐఎఎస్ అధికారి కి కరోనా పాజిటివ్‌. ఆయనతో పాటు సమావేశానికి హాజరైన పలువురు అధికారులు,వైద్యులను హోమ్ క్వారంటైన్ లో వెళ్లాలని సూచన.
  • మొబైల్ సేవల కోసం 11 అంకెల నంబరింగ్ ప్లాన్‌ను ట్రాయ్ సిఫారసు చేసినట్లు కొన్ని మీడియా సంస్థల లో వార్తలు వచ్చాయి. TRAI సిఫారసు ప్రకారం,దేశం లో 10-అంకెల నెంబర్ కొనసాగుతుంది. మేము 11-అంకెల నంబరింగ్ ప్లాన్‌కు మార్చడాన్ని ఖండిస్తున్నాం. టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా.

ఆ సెంటిమెంట్‌తో అలీకి అదృష్టం కలిసొస్తుందా?

Will Ali Reza emerge as Bigg Boss Season 3 Winner, ఆ సెంటిమెంట్‌తో అలీకి అదృష్టం కలిసొస్తుందా?

ఎన్నో ఆసక్తికరమైన మలుపులు, మరెన్నో వివాదాలతో బిగ్ బాస్ సీజన్ 3 చివరికి చేరుకుంది. హయ్యెస్ట్ టీఆర్ఫీ రేటింగ్స్‌తో మొదలైన ఈ షో క్రమేపి సోసోగా మారిందని చెప్పొచ్చు. గత రెండు సీజన్లతో పోలిస్తే.. ఈసారి కంటెస్టెంట్ల పరంగా ఎవరూ కూడా చెప్పుకోదగ్గ పెర్ఫార్మన్స్‌లు ఇవ్వలేదు. అలీ రెజాను మినహాయిస్తే.. మిగిలిన ఇంటి సభ్యులందరూ తేలిపోయారు. ఇదిలా ఉంటే ఈ వారం ఎలిమినేషన్‌కు హౌస్‌లో ఉన్న ఏడుగురు కంటెస్టెంట్లు నామినేట్ అయిన సంగతి తెలిసిందే.

ఇకపోతే ‘బిగ్ బాస్’ షోను ఓ సెంటిమెంట్ వెంటాడుతోందని సోషల్ మీడియాలో ఊహాగానాలు వినిపిస్తున్నాయి. గత సీజన్ల విన్నర్స్‌ను దృష్టిలో పెట్టుకుని ఈ రియాలిటీ షోకు ’11’ సెంటిమెంట్ కుదిరినట్లే కనిపిస్తోందని నెటిజన్లు అంటున్నారు. మొదటి బిగ్ బాస్ సీజన్‌లో 11వ కంటెస్టెంట్‌గా శివ బాలాజీ అడుగుపెట్టి.. విన్నర్‌గా గెలిచాడు. అలాగే రెండో సీజన్‌లో కౌశల్ మందా 11వ కంటెస్టెంట్ కావడం.. అనూహ్యంగా విజయం సాధించడం జరిగింది. ఇక ఇప్పుడు కూడా 11వ వ్యక్తిగా ఎంట్రీ ఇచ్చిన అలీ రెజా బిగ్ బాస్ విన్నర్‌‌గా అవతరిస్తాడని అతడి ఫ్యాన్స్ భావిస్తున్నారు. అయితే మరికొందరు మాత్రం అది సాధ్యం కాదని భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.

అలీ రెజా ఒకసారి ఎలిమినేట్ అయ్యి.. మళ్ళీ హౌస్‌లోకి తిరిగి వచ్చిన సంగతి తెలిసిందే. ఇలా వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా వచ్చిన వాళ్ళెవరూ చివరి వరకు హౌస్‌లో ఉండలేదు. అంతేకాక రీ-ఎంట్రీ ఇచ్చిన తర్వాత అలీలో మునపటి జోష్ తగ్గిందనే చెప్పాలి. కానీ అతడికి మాత్రం బయట అమ్మాయిల్లో మంచి ఫాలోయింగ్ ఉంది. మరోవైపు ఈ వారం ఓటింగ్‌ను పరిశీలిస్తే.. అలీ రెజాకు సోసోగానే ఓట్లు పడినట్లు తెలుస్తోంది. అయితే ఇది బిగ్ బాస్ కాబట్టి.. మున్ముందు ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో ఇప్పుడే చెప్పలేం. ఇప్పటివరకు వరుణ్ సందేశ్, బాబా భాస్కర్‌లు టైటిల్ వేటలో ముందు ఉండగా… అనూహ్యంగా ఈ రేస్‌లోకి అలీ రెజా కూడా వచ్చే అవకాశాలు లేకపోలేదు.

Related Tags