ఏజెన్సీలో పేలిన నాటు తుపాకీ..గిరిజన యువకుడు మృతి

విశాఖ ఏజెన్సీ డుంబ్రిగుడ మండలంలో నాటుతుపాకీ కాల్పులు కలకలం రేపాయి. ఈ కాల్పుల్లో సుమారు 24 ఏళ్ల యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. జరిగిన ఘటనతో ఏజెన్సీ పోలీసు యంత్రాంగం అప్రమత్తం అయ్యింది. పరిసర పోలీస్ స్టేషన్లను అలర్ట్ చేశారు పోలీసులు.

ఏజెన్సీలో పేలిన నాటు తుపాకీ..గిరిజన యువకుడు మృతి
Follow us

|

Updated on: Oct 17, 2020 | 4:34 PM

విశాఖ ఏజెన్సీ ప్రాంతంలో వన్యప్రాణుల కోసం వేటగాళ్లు ఉచ్చులు ఏర్పాటు చేస్తుంటారు. మరికొన్ని సమయాల్లో కొందరు తుపాకులతో వేటాడుతుంటారు. నాటు తుపాకులతో అడవి జంతువుల కోసం వేటాడే క్రమంలో జరిపిన కాల్పుల్లో స్థానిక గిరిజన యువకుడు ప్రాణాలు కోల్పోయాడు.

విశాఖ ఏజెన్సీ డుంబ్రిగుడ మండలం గదబగలుగులో నాటు తుపాకీ కాల్పులకు బలరాం అనే గిరిజన యువకుడు మృతిచెందాడు. వన్యప్రాణుల వేటకోసం 20 మంది గిరిజనులు వెళ్లి కొండపై గుంపులుగా విడిపోయారు. అయితే, అడవి పంది నెపంతో..ఓ బృందం కాల్పులు జరపడంతో అక్కడే ఉన్న మరో గ్రూప్‌కు చెందిన బలరాం అనే గిరిజనుడు బుల్లెటు్ల తగిలి ప్రాణాలు కోల్పోయాడు. అయితే, ఈ ఘటన జరిగిన వెంటనే పోలీసులు అలర్ట్ అయ్యారు. అన్ని పోలీస్ స్టేషన్లను అప్రమత్తం చేశారు.

ఏజెన్సీ ప్రాంతాల్లో వన్యప్రాణుల వేట సాగిస్తున్న వారిపై ఆరా తీశారు. వారంతా ఎంతకాలం నుండి వేటసాగిస్తున్నారనే విషయాలను తెలుసుకున్నారు. మరోవైపు గిరిజన యువకులకు నాటు తుపాకులు ఎక్కడి నుంచి వచ్చాయనే దానిపై కూడా ఆరా తీయటం మొదలు పెట్టారు. ఈ క్రమంలోనే గిరిజనులకు పలు సూచనలు చేశారు. నాటు తుపాకులు వినియోగించడం నేరమంటున్న అధికారులు..ఒకవేళ ఎవరిదగ్గరైనా నాటు తుపాకులుంటే సంబంధిత పోలీస్ స్టేషన్లలో వాటిని డిపాజిట్ చేయాలని సూచించారు. లేదంటే చట్టపరమైన చర్యలు తప్పవని డీఎస్పీ హెచ్చరించారు. ఈ ఘటనలో మరణించిన బలరాం కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరు విలపిస్తున్నారు.

పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!