Breaking News
  • ప్రధాని శంకుస్థాపన చేసిన రాజధానిని మార్చే హక్కు ఎవరికీ లేదు. సుప్రీంకోర్టు, రాష్ట్రపతి ఒప్పుకుంటేనే హైకోర్టు కదులుతుంది-కేశినేని. అమరావతి రక్షణకు పార్లమెంటు వేదికగా పోరాటం చేస్తాం-కేశినేని.
  • చిత్తూరు: తిరుచానూరు పీఎస్‌ నుంచి బేడీలతో పరారైన దొంగ. ట్రాక్టర్‌ దొంగతనం కేసులో నాగరాజును అరెస్ట్‌చేసిన పోలీసులు. దొంగ నాగరాజు కోసం గాలిస్తున్న పోలీసులు.
  • ఢిల్లీ: ఆప్‌ ప్రభుత్వంపై బీజేపీ తీవ్ర విమర్శలు. నిర్భయ దోషులను రక్షించేందుకు ఆప్‌ ప్రభుత్వం యత్నిస్తోంది. కావాలనే న్యాయ ప్రక్రియను ఆలస్యం చేస్తోంది-మనోజ్‌ తివారీ. పోలీసులు తమ పరిధిలో లేరని తప్పించుకోవాలని ఆప్‌ చూస్తోంది -బీజేపీ ఢిల్లీ చీఫ్‌ మనోజ్‌ తివారీ.
  • అనంతపురం: తాడిపత్రిలో కత్తిపోట్లు. డబ్బుల విషయంలో స్నేహితుల మధ్య ఘర్షణ. రాము అనే వ్యక్తిని కత్తితో పొడిచిన రవితేజ. ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందిన రాము.
  • రైతులు కన్నీళ్లు పెట్టినా సీఎం మనసు కరగడం లేదు. రాష్ట్రంలో పోలీస్‌ రాజ్యం నడుస్తోంది-దేవినేని ఉమ. విశాఖలో భూదందా నడుస్తోంది-మాజీ మంత్రి దేవినేని ఉమ. రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం కోసం రాజధానిని విశాఖకు తరలిస్తున్నారు. పులివెందుల పులి డమ్మీ కాన్వాయ్‌తో వెళ్తోంది. దేశ చరిత్రలో డమ్మీ కాన్వాయ్‌తో వెళ్లిన సీఎం చరిత్రలో లేరు. సచివాలయానికి వెళ్లేందుకు మెటల్‌ రోడ్డు వేసుకుంటున్నారు. 5 కోట్ల మంది ప్రజలు రేపు రోడ్లపైకి రావాలి-దేవినేని ఉమ.

ఇల్లీగల్ అఫైర్… అడ్డుగా ఉన్నాడని భర్త హత్య

, ఇల్లీగల్ అఫైర్… అడ్డుగా ఉన్నాడని భర్త హత్య

బస్సు డ్రైవర్‌తో వివాహేతర సంబంధం పెట్టుకున్న ఓ మహిళ అతడితో కలిసి కట్టుకున్న భర్తనే హతమార్చిన ఘటన హైదరాబాద్‌లోని మూసాపేటలో జరిగింది.

విజయనగరం జిల్లాకు చెందిన నాగేశ్వర్‌రావుకు భార్య నాగమణి, ఇద్దరు పిల్లలున్నారు. వీరు హైదరాబాద్‌, విజయవాడలో జరిగే ఎగ్జిబిషన్‌లలో స్టాళ్లు ఏర్పాటు చేస్తుంటారు. ఈ క్రమంలోనే కనకదుర్గ ట్రావెల్స్‌లో డ్రైవర్‌గా పనిచేసే కృష్ణా జిల్లాకు చెందిన కన్నాతో వీరికి పరిచయం ఏర్పడింది. దీంతో నాగేశ్వర్‌రావు ఇంటికి అప్పుడప్పుడు వచ్చి వెళ్లేవాడు. ఈ నేపథ్యంలోనే నాగమణి, కన్నా మధ్య పరిచయం పెరిగి వివాహేతర సంబంధానికి దారితీసింది. ఈ విషయాన్ని కన్నా భార్య పుష్ప నాగేశ్వర్‌రావుకు చెప్పడంతో అతడు భార్యను వేధించడం మొదలుపెట్టాడు. కన్నాను కూడా ఇంటికి రావొద్దని చెప్పేశాడు.

తమ బంధానికి అడ్డుగా ఉన్న నాగేశ్వర్‌రావును అడ్డు తొలగించుకోవాలని వారిద్దరూ నిర్ణయించుకున్నారు. నాగేశ్వర్‌రావును హత్యచేస్తే రూ.50వేలు ఇస్తానని కన్నా తన స్నేహితుడు షేక్ సుభానీకి చెప్పడంతో అతడు అంగీకరించాడు. దీంతో సుభానీని రెండు రోజులపాటు నాగేశ్వర్‌రావు ఇంటికి పంపాడు. ఈనెల 1న సుభాని, నాగేశ్వర్‌రావు మద్యం తాగారు. అనంతరం నిద్రలోకి జారుకున్న నాగేశ్వర్‌రావును సుభానీ కత్తితో పొడిచి చంపేశాడు. నాగమణిపై నిఘా పెట్టిన పోలీసులు ఆమె కాల్‌డేటాను పరిశీలించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో పోలీసులు ముగ్గురిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపారు.