ప్రియుడి మోజులో పడి భర్తను చంపిన భార్య..

ప్రియుడి మోజులో పడి ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్తనే కడతేర్చింది ఓ ఇల్లాలు.

  • Balaraju Goud
  • Publish Date - 2:33 pm, Tue, 27 October 20

ప్రియుడి మోజులో పడి ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్తనే కడతేర్చింది ఓ ఇల్లాలు. పెళ్లై ఓ పాప కూడా ఉన్న యువతి లాక్ డౌన్ సమయంలో పరిచయమైన వ్యక్తితో ప్రేమలో పడింది. ప్రియుడితో వివాహేతర బంధం మత్తులో పడి కట్టుకున్న భర్తను కడతేర్చింది. వివరాల్లోకి వెళితే కర్ణాటక రాజధాని బెంగుళూరులోని డెంకణికోటకు చెందిన మాదేశ్(35) అనే వ్యక్తితో ప్రేమ అనే యువతికి వివాహం జరిగింది. ఇద్దరు కూడా ప్రేమించి పెద్దలను ఒప్పించి మరీ పెళ్లి చేసుకున్నారు. వీరికి ఒక కూతురు ఉంది. మాదేశ్‌ టైలర్‌గా, ప్రేమ జిగణి సమీపంలో గార్మెంట్స్‌లో పనిచేసేది. సజావుగా సాగుతున్న వారి కాపురంలో లాక్‌డౌన్‌ వారి కాపురంలో చిచ్చు పెట్టింది. లాక్‌డౌన్‌ డసమయంలో ఇంటివద్దనే ఉండే ప్రేమకు శివమల్ల అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. ఇద్దరి మధ్య వివాహేతర సంబంధానికి దారికి తీసింది. ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని ఇంటి నుంచి వెళ్లిపోవాలనుకున్నారు. ఇందుకు అడ్డుగా ఉన్నా భర్త మాదేశ్‌ను హంతమోదించాలని నిర్ణయించారు. ఈ నెల 17 తేదీ రాత్రి అతడు ఒంటరిగా ఉండగా రాళ్లతో కొట్టి చంపి పారిపోయారు. ఇదిలావుంటే, ఈ ఘటనకు సంబంధించి హత్య కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పోలీసులు గాలించి ప్రేమ, శివమల్లుతో పాటు వారికి సహకరించిన మల్లేశ్‌ అనే మరో వ్యక్తిని అరెస్ట్‌ చేశారు. ముగ్గురిపై హత్య కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించారు పోలీసులు.