ప్రియుడి కోసం భర్తపై కాల్పులు..ప్లాన్ ఫెయిలై కటకటాల్లోకి

Arrested

గ్రేటర్ నోయిడాలో ఈ ఏడాది జులై 23న జరిగిన కాల్పుల ఘటనకు సంబంధించి మిస్టరీని పోలీసులు చేధించారు. కేసులో కీలక వ్యక్తులను విచారించిన పోలీసులు పలు కోణాల్లో దర్యాప్తు చేపట్టారు. చివరకు తనభార్యే తనను అంతమొందించాలని స్కేచ్ వేసినట్లుగా పోలీసులు నిర్ధారించారు. తీవ్రంగా గాయపడిన బాధితున్నిపోలీసులు ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందజేస్తున్నారు.  భర్తపై హత్యాయత్నానికి పాల్పడిన భార్య, ఆమె ప్రియుడు జిమ్ ట్రైనర్ తో పాటు మరో వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

రియల్ ఎస్టేట్ కంపెనీ మేనేజర్ గా పనిచేసే రాజీవ్ వర్మ, అతని భార్య శిఖా గ్రేటర్ నోయిడాలోని సఖీపూర్ లో నివసిస్తున్నారు. రాజీవ్ వర్మ ఓ రియల్ ఎస్టేట్ కంపెనీలో మేనేజర్ గా విధులు నిర్వహిస్తున్నాడు. అయితే,  కొంతకాలంగా వర్మ భార్య శిఖాతో జిమ్ ట్రైనర్ రోహిత్ కశ్యప్ కు మధ్య వివాహేతరం సంబంధం ఏర్పాడింది. దీంతో వారిద్దరూ పథకం ప్రకారం వర్మను అడ్డుతొలగించుకోవాలనుకున్నట్లుగా పోలీసులు తేల్చారు. వర్మను హత్య చేసేందుకు గానూ రూ.1.2 లక్షలకు రౌడీషీటర్ తో ఒప్పందం చేసుకున్నట్లుగా నిందితులు అంగీకరించినట్లు పోలీసులు వెల్లడించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *