నువ్వులేని లోకంలో..నేనెందుకు?

ఇన్నాళ్లూ ప్రేమను, అనురాగాన్ని పంచి ఇచ్చిన భర్త మరణాన్ని ఆ ఇల్లాలు తట్టుకోలేకపోయింది. భర్త మృతిచెందిన గంటల వ్యవధిలో తానూ కన్నుమూసింది. మరణం కూడా వారి అనుబంధాన్ని విడదీయలేకపోయింది. తన జీవిత భాగస్వామి లేని ఈ లోకంలో ఉండలేనంటూ భర్త మృతదేహం వద్ద రోదిస్తూ తుది శ్వాస విడిచింది. కర్నూలు జిల్లా తుగ్గలి మండలం రాంపల్లి గ్రామంలో జరిగింది ఈ హృదయవిదారక ఘటన. మారికి రంగన్న(65) అనే వ్యక్తి అనారోగ్యంతో బాధపడుతూ ఆదివారం తెల్లవారుజామున మృతి చెందాడు. ఉదయం అంత్యక్రియలకు ఏర్పాట్లు చేస్తుండగా భార్య మాధవి(55) తన భర్త మృతదేహంపై పడి రోదిస్తూ సృహ కోల్పోయింది. కుమారులు ఆమెను పైకి లేపే యత్నం చేసినప్పటికి స్పందన లేకపోవడంతో స్థానిక వైద్యుడికి సమాచారం అందించారు. ఆమెను పరిశీలించిన వైద్యుడు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. దంపతులు గంటల వ్యవధిలోనే కన్నుమూయడంతో కుటుంబసభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు. ఈ ఘటనతో  గ్రామంలో విషాదం నెలకొంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *